• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /కుక్కపై భారీ కొండచిలువ వరుస దాడులు.. చివరి క్షణంలో జరిగింది ఇదే!

కుక్కపై భారీ కొండచిలువ వరుస దాడులు.. చివరి క్షణంలో జరిగింది ఇదే!

Giant Python Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కుక్క ఒకచోట ఉండగా.. దాదాపు 20కి పైగా అడుగులు కలిగిన కొండ చిలువ దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇలా దానిపై పలుసార్లు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో కుక్క దాని నుంచి తప్పించుకుంది. ఈ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 17, 2026, 10:59 AM IST|Updated: Oct 17, 2026, 11:00 AM IST
joinshare
కుక్కపై భారీ కొండచిలువ వరుస దాడులు.. చివరి క్షణంలో జరిగింది ఇదే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కుక్కపై భారీ కొండచిలువ వరుస దాడులు.. చివరి క్షణంలో జరిగింది ఇదే!

కుక్కపై భారీ కొండచిలువ వరుస దాడులు.. చివరి క్షణంలో జరిగింది ఇదే!

2

దాండియా ఆడుతూ లిప్ కిస్.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో!

3

ఆహారం నుంచి పొదుపు వరకు.. ఇంట్లో సుఖసంతోషాలు పెంచే చాణక్యుడి జీవిత సూత్రాలు!

4

అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల దర్శనం! తెలుగురాష్ట్రాల మీదుగా ప్రయాణం!

5

చేతికి డబ్బు రాగానే ఈ 4 తప్పులు చేయకండి.. చాణక్య నీతి చెబుతున్న కీలక పాఠాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Giant Python Attacks Dog Video: సాధారణంగా అడవి ప్రాంతాల్లో లేదా గ్రామానికి అతి సమీపంలో అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలతో పాటు కొన్ని జంతువులు భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొండచిలువ లాంటి పాములు కనిపిస్తే భయపడుతూ పరుగులు పెడుతూ ఉంటారు. తాజాగా అలాంటి భయాందోళనకు గురి చేసే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెరలు కొడుతోంది. ఆహారం కోసం కాపు కాసిన ఒక భారీ కొండచిలువ నోటి నుంచి ఓ కుక్క అత్యంత చాకచక్యంగా తప్పించుకున్న దృశ్యాలు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఎంతో సేపు ఒకచోట వెయిట్ చేసిన అత్యంత ప్రమాదకరమైన కొండచిలువకు ఒక వీధి కుక్క కనిపించింది. అయితే ఆ పాము సహజంగానే తమ ఆహారాన్ని పసిగట్టి.. మెరుపు దాడి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ కొండచిలువ కుక్కపై ఒక్కసారిగా దాడి చేసి తన పట్టులోకి లాక్కునే ప్రయత్నం చేసేందుకు ఎంతగానో కృషి చేసింది. అయితే ఈ సమయంలో ఆ కుక్క ఏం పని చేసిందో చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోవాల్సిందే..

అయితే కొండచిలువ కదలికలను ముందే పసిగట్టిన ఆ కుక్క ఏ మాత్రం తడబాటు లేకుండా.. ఆ పాము ముంగిట్లోకి వచ్చిన క్షణం లోను అప్రమత్తత కోల్పోకుండా.. కొండచిలువ నోరు తెరిచి దాడి చేయబోయిన వెంటనే వేగంగా వెనక్కి జరిగి ఆ ప్రమాదం నుంచి కుక్క తప్పించుకోవడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.  ఒక్క క్షణం ఆలస్యమైన ఆ కొండచిలువ కుక్కపై దాడి చేసి ప్రాణాలు తీసి ఉండేది. కానీ ఆ కుక్క ప్రదర్శించిన తీరు.. చురుకుదనం ప్రాణాలను ఎంతగానో కాపాడింది. అయితే, ఆ పాము కుక్కపై అలా పలుసార్లు దాడి చేసేందుకు ప్రయత్నించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూహం సంపాదించుకుంది. కొండచిలువ దాడి నుంచి తప్పించుకున్న తీరును చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఆ కుక్క చూపించిన చురుకుదనమే దాని ప్రాణాన్ని నిలబెట్టుకుంది.. అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా కుక్క సమయం బాగుంది అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో మాత్రం ఊహించని స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది..

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by อุมาพร สอนอ้น (@umaaphrsnn)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Trending News
Telugu News