• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Municipal Elections: ఏపీలో నేడే మున్సిపల్ ఎన్నికలు..పోలింగ్‌కు సర్వం సిద్ధం..రాష్ట్రవ్యాప్తంగా కెమెరాలతో నిఘా!

AP Municipal Elections: ఏపీలో నేడే మున్సిపల్ ఎన్నికలు..పోలింగ్‌కు సర్వం సిద్ధం..రాష్ట్రవ్యాప్తంగా కెమెరాలతో నిఘా!

AP Municipal Elections Surveillance: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 36 వేలకు పైగా పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ పునేఠా పిలుపునిచ్చారు.

Written ByHarish Darla
Published: Nov 01, 2026, 03:58 AM IST|Updated: Nov 01, 2026, 04:01 AM IST
joinshare
AP Municipal Elections: ఏపీలో నేడే మున్సిపల్ ఎన్నికలు..పోలింగ్‌కు సర్వం సిద్ధం..రాష్ట్రవ్యాప్తంగా కెమెరాలతో నిఘా!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
RC 17 Sukumar Pooja Ceremony: రామ్‌చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్..నేడే #RC17 మూవీ షూటింగ్ స్టార్ట్!

RC 17 Sukumar Pooja Ceremony: రామ్‌చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్..నేడే #RC17 మూవీ షూటింగ్ స్టార్ట్!

2

టెక్నాలజీ రంగంలో తిరుగులేని శక్తిగా ఏఐ.. మానవాళి పాలిట తీవ్ర ముప్పుగా కృత్రిమ మేథ..

3

ఓటు చోరీ పై నేడే ఢిల్లీలో రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సమరం..

4

AP Municipal Elections: ఏపీలో నేడే మున్సిపల్ ఎన్నికలు..పోలింగ్‌కు సర్వం సిద్ధం..రాష్ట్రవ్యాప్తంగా కెమెరాలతో నిఘా!

5

Thummala Nageswara Rao: తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. క్రాప్‌ హలీడేపై తెలంగాణ మంత్రి కీలక ప్రకటన!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Municipal Elections Surveillance: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ పునేఠా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 36,351 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలను నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ విభాగాలుగా వర్గీకరించారు. భద్రతలో భాగంగా హైపర్ సెన్సిటివ్ కేంద్రాల్లో 1+4 పద్ధతిలో, సెన్సిటివ్ కేంద్రాల్లో 1+3 పద్ధతిలో సిబ్బందిని కేటాయించారు.

బ్యాలెట్ బాక్సుల రక్షణ, భద్రమైన తరలింపు కోసం 1,543 రూట్ మొబైల్ వాహనాలను అందుబాటులో ఉంచారు. పల్నాడు వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు 130 ప్లటూన్ల ఏపీ స్పెషల్ పోలీస్ (APSP) బలగాలను రంగంలోకి దించారు. డీఎస్పీ, అదనపు ఎస్పీల నాయకత్వంలో క్విక్ రియాక్షన్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ పునేఠా స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో సీసీ కెమెరాల నిఘా
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ అంతటా సమగ్ర నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశారు. మొత్తం 6,600 పోలింగ్ ప్రదేశాలలో 12,000 సీసీ కెమెరాలను అమర్చి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్‌గా గుర్తించిన 5,500 కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కెమెరాల సదుపాయం లేని ప్రాంతాల్లో వీడియోగ్రఫీ, మారుమూల ప్రాంతాల్లో ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నారు.

ఎన్నికల బరిలో అభ్యర్థులు, పోలింగ్ సిబ్బంది.
రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డు సభ్యుల పదవుల కోసం మొత్తం 9,642 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కార్పొరేషన్లలోని 922 వార్డులకు 3,773 మంది, మున్సిపాలిటీలలోని 2,382 వార్డులకు 6,669 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మేయర్, చైర్‌పర్సన్ స్థానాలకు 153 మంది, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులకు 367 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 75,000 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఓటింగ్ శాతాన్ని ప్రతి రెండు గంటలకొకసారి మీడియాకు వెల్లడిస్తారు.

ఏకగ్రీవ మున్సిపాలిటీలు, ఎస్ఈసీ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి, దర్సి, పలమనేరు, ప్రొద్దుటూరు, రాయచోటి, కమలాపురం అనే 8 మున్సిపాలిటీలు ఏకగ్రీవం కావడంతో అక్కడ పోలింగ్ జరగడం లేదు. ప్రవర్తనా నియమావళి ఎక్కువ కాలం అమల్లో ఉంటే సంక్షేమ, అభివృద్ధి పనులు నిలిచిపోతాయని, అందుకే ఈ ప్రక్రియను త్వరగా ముగించడం శ్రేయస్కరమని ఎస్ఈసీ అనిల్ పునేఠా పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లు చైతన్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Elections
Andhra Pradesh
AP News
Telugu News