NTR Bharosa Pension Status 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామాజిక భద్రతను పటిష్టం చేసే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ వరకు కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ నగదు అందుతోంది. ఈ పథకం ద్వారా వితంతువులు, వృద్ధులు మరియు దివ్యాంగులు కూడా లబ్ధిదారులుగా ఎంపికై సాయం పొందుతున్నారు. అయితే, కొత్తగా పెన్షన్ కోసం అప్లికేషన్ చేసుకున్న వారి వివరాలను ధృవీకరించడానికి ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. డైరెక్ట్ లింక్ https://sspensions.ap.gov.in/SSP ద్వారా తెలుసుకోవచ్చు.
పెన్షన్ మొత్తాల వివరాల విషయానికి వస్తే, వృద్ధాప్య పింఛను పొందే వారికి నెలకు రూ.4,000 అందిస్తున్నారు. అయితే దీనికి దరఖాస్తుదారుడి వయసు 60 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే వితంతువులకు కూడా రూ.4,000 పింఛను అందుతుంది. దివ్యాంగులకు రూ.6,000 , పూర్తి వైకల్యం ఉన్నవారికి రూ.10,000 , కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10,000, మంచానికే పరిమితమైన వారికి గరిష్టంగా రూ.15,000 వరకు అందిస్తున్నారు.
ఎన్టీఆర్ భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను కలిగి ఉండాలి. వారు ఆదాయపన్నుచెల్లించేవారు అయి ఉండకూడదు. ఎలాంటి నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉండకూడదు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన ముఖ్యమైన పత్రాలు: ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, సదరం సర్టిఫికెట్, అవసరమైన సందర్భాల్లో మరణ ధ్రువీకరణ పత్రం వంటివి సమర్పించాల్సి ఉంటుంది.
ఎన్టీఆర్ భరోసా ఆన్‌లైన్ స్టేటస్ విషయానికి వస్తే, దరఖాస్తు చేసుకున్న వారు తమ అప్లికేషన్ స్థితిని ఆన్‌లైన్‌లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. తమ ఆధార్ నంబరు లేదా పెన్షన్ ఐడి ద్వారా వివరాలను సబ్మిట్ చేస్తే, స్క్రీన్ పైన మీ ఎంపీడీఓ లేదా సచివాలయ అప్రూవల్ పొందిందా లేదా అనే సమాచారం కనిపిస్తుంది. ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు, గత మూడు నెలల్లో తమ ఖాతాల్లో నగదు జమ అయ్యిందో లేదో కూడా స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు.
కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 22 నుంచి 24వ తేదీ వరకు ఎంపీడీఓ, జిల్లా, రాష్ట్ర స్థాయిల వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. అనంతరం 25వ తేదీన పెన్షన్లను ఆమోదిస్తారు, ఆ తర్వాత దశలవారీగా పెన్షన్ మంజూరు చేయబడుతుంది. దీని కోసం సచివాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 62 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. ప్రభుత్వం నుండి తుది ఉత్తర్వులు వస్తే, అక్టోబర్ 1 నుండి కొత్త పెన్షన్ల ప్రయోజనాలు కూడా అందుతాయని సమాచారం అందుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి