SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక.. మరోసారి ఈదురుగాలులతో వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?

AP Weather Alert: ఏపీలో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో నవంబర్ 13 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ 13 వరకు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. దీంతో తీర ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Written By Renuka Godugu
Published: Nov 09, 2026, 10:11 AM IST | Updated: Nov 09, 2026, 10:26 AM IST
Image Credit: AP Weather Alert:
Join

AP Weather Alert: ఏపీలో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో నవంబర్ 13 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ 13 వరకు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. దీంతో తీర ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

రానున్న మరికొన్ని రోజులు, అంటే ఈ నెల 13వ తేదీ వరకు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వారు తెలిపారు. ఇటు కోస్తాంధ్రతో పాటు అటు రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కొద్ది రోజుల క్రితం వచ్చిన రెండు తుఫానులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. ఆ సమయంలో గంటకు 195 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో అర్ణబ్ తుఫాను భారీగా వర్షాలు కురిపించడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచాయి. అలాగే మొన్న వచ్చిన తుఫాను గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచికొట్టాయి. దాని ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, మరోసారి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, ఈ నెల 13వ తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ వర్షాలు పడుతున్నాయని తెలుస్తోంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో లేదా కోస్తాంధ్రకు చెందిన యానాం ప్రాంతంలో ఎక్కువగా వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే తీర ప్రాంతం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

తుఫానులు ఏర్పడిన అనంతరం వస్తున్న ఈ మార్పుల నేపథ్యంలోనే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగానే ఉన్నాయి. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా సరిగా పునరుద్ధరణ కాలేని పరిస్థితులు ఉన్నాయి.

ఐదు నెలల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రోజుకు 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు, ఎండవేడి, ఉక్కపోత కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇక వర్షాలు కురవవేమో అని భావించిన ఏపీ ప్రజలకు, మొన్న వచ్చిన వాయుగుండం, ఆ తర్వాత వచ్చిన రెండు తుఫానులు ఏకధాటిగా వర్షాలు కురిపించాయి. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ వంటి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడమే కాకుండా, అనేక ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోయారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీని ప్రభావంతో భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడతాయని, ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Read Also: ఏపీలో పల్లె పోరు ముహూర్తం ఖరారు..! 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు.. నవంబర్ 13న షెడ్యూల్!   
 

ఏది ఏమైనా, వర్షం కోసం ఎదురుచూసిన రైతులకు ఒక విధంగా తీపికబురు అయినప్పటికీ, మొన్న వచ్చిన తుఫానుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై చాలా భారీగా పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కోస్తాంధ్రకు చెందిన కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. రానున్న మరికొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్‌పై వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతం వెంబడి ఈదురు గాలులతో పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉందని వారు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES