• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /మీకు కొత్తగా చేయూత పింఛన్ మంజూరైందా? మొబైల్‌లోనే ఇలా సులువుగా చెక్ చేసుకోండి..!!

మీకు కొత్తగా చేయూత పింఛన్ మంజూరైందా? మొబైల్‌లోనే ఇలా సులువుగా చెక్ చేసుకోండి..!!

Cheyutha Pension: తెలంగాణలో కొత్త పెన్షన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. నవంబర్ నెల నుంచి చేయూత స్కీమ్ కింద సామాజిక పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Written ByBhoomi
Published: Nov 09, 2026, 11:56 AM IST|Updated: Nov 09, 2026, 11:59 AM IST
joinshare
మీకు కొత్తగా చేయూత పింఛన్ మంజూరైందా? మొబైల్‌లోనే ఇలా సులువుగా చెక్ చేసుకోండి..!!
Image Credit: Cheyutha Pension

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
స్థానిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఘన విజయం! ఓట్ల శాతంతో మైండ్ బ్లాకింగ్ వివరాలు వెల్లడించిన చంద్రబాబు!

స్థానిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఘన విజయం! ఓట్ల శాతంతో మైండ్ బ్లాకింగ్ వివరాలు వెల్లడించిన చంద్రబాబు!

2

నగరంలో ముంచుకొస్తున్న తాగునీటి సమస్య.. మీ ప్రాంతం కూడా ఈ జాబితాలో ఉందా..??

3

ఒకేసారి 1000 రాకెట్లు పేల్చిన యూట్యూబర్‌.. ఆకాశంలో అద్భుతం!

4

Bhagyalakshmi Temple Charminar: చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి పోటెత్తిన భక్తులు..దీపావళి వేళ ఖజానా పంపిణీ!

5

స్మార్ట్‌ఫోన్ దొంగతనానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు.. రైలుతో పాటు వేలాడుతూ ప్రయాణం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cheyutha Pension: తెలంగాణలో కొత్త పెన్షన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. నవంబర్ నెల నుంచి చేయూత స్కీమ్ కింద సామాజిక పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే లబ్దిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందించనున్నారు. అయితే తమ పేరు జాబితాలో ఉందా లేదా.. కొత్త పెన్షన్ మంజూరు అయ్యిందా లేదా అనే వివరాలు ప్రజలు ఇంట్లోనే ఉండి ఈజీగా ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

రాష్ట్రంలో దాదాపు 5.50లక్షల మంది కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షేత్ర స్ధాయిలో పరిశీలించిన అధికారులు దాదాపు 4.50లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్లు సర్కార్ వెల్లడించింది. వీరికి పలు కేటగిరీల కింద సామాజిక పెన్షన్ మంజూరు చేయనున్నారు. కొత్తగా అర్హత సాధించిన వారిలో సుమారు 3లక్షల మంది వితంతువులు లక్ష మంది దివ్యాంగులు, 50వేల మంది నేత, గీత కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. అర్హుల జాబితాకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో.. పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో కొత్త పింఛనును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అనంతరం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పర్యవేక్షణలో దరఖాస్తులను పరిశీలించారు. అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో వారి అర్హతను ధృవీకరించారు. ఈ ప్రక్రియ అనంతరం, అర్హులైన వ్యక్తుల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ఆమోదంతో, కొత్త పింఛను అమలుకు మార్గం సుగమమైంది. దసరా నుంచి కొత్త పింఛనును ప్రవేశపెట్టేందుకు తొలుత ప్రచారం ప్రారంభించినప్పటికీ, వివిధ కారణాల వల్ల అది ఆలస్యమైంది. ఇప్పుడు, నవంబర్ నుంచి దానిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ఆన్‌లైన్‌లో చేయూత పెన్షన్ స్టేటస్ ఇలా చేసుకోవచ్చు:

ఇటీవల పెన్షన్‌కు అర్హత పొందిన వారు అధికారిక చెయూత పోర్టల్‌లో తమ వివరాలను చెక్ చేసుకోవచ్చు.

*ముందుగా, అధికారిక తెలంగాణ చెయూత వెబ్‌సైట్‌ కు లాగిన్ అవ్వండి.

https://www.cheyutha.telangana.gov.in/SSPTG/UserInterface/Portal/GeneralSearch.aspx

*మీ పెన్షన్ ఐడి లేదా యూఐడి/సదారెం ఐడి వివరాలను నమోదు చేయండి.

*ఐడి వివరాలు అందుబాటులో లేకపోతే, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ, పెన్షనర్ పేరు, కుటుంబ పెద్ద పేరు వంటి వివరాలను నమోదు చేయండి.

*ఆ తర్వాత సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.

స్క్రీన్‌పై కనిపించే వివరాల్లో మీ పెన్షన్ స్టేటస్ చూసుకోవచ్చు.  

పెన్షన్ దరఖాస్తు స్టేటస్ ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు:

*ముందుగా  చేయూత  అప్లికేషన్ స్టేటస్ పోర్టల్లోకి వెళ్లాలి.

https://www.cheyutha.telangana.gov.in/SSPTG/UserInterface/Portal/NewApplicationDetailsSearch.aspx

*మీ అప్లికేషన్ ఐడీ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. 

*జిల్లా, మండలం, గ్రామం లేదా వార్డు వివరాలను ఎంటర్  చేయాలి. 

*ఇప్పుడు సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

*స్క్రీన్ పై మీ దరఖాస్తుకు సంబంధించి ప్రస్తుత స్టేటస్  కనిపిస్తుంది.

ఇలా ఇంట్లో నుంచే చేయూత పెన్షన్ మంజూర్, దరఖాస్తు స్టేటస్ కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఆన్ లైన్ లో పెన్షన్ మంజూరు అయినట్లు కనిపించడం, బ్యాంకు అకౌంట్లో నగదు జమ కావడం రెండూ కూడా వేర్వేరు. చెల్లింపు వివరాలను కూడా విడిగానే చెక్  చేసుకోవాలి.

Also Read: 

 

 

 

 

తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతో తెలుసా?

 

 

 

 

 

మన శరీరానికి నిజమైన ఇంజన్ ఆయిల్ ఇదే.. ఈ పోషకం లోపిస్తే అనారోగ్య సమస్యల సునామీ తప్పదు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes
Revanth Reddy
Telangana News