SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి.. ఏపీ రైతులకు కీలక ఆదేశాలు!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులైన ఏపీ రైతులకు బిగ్ అలర్ట్! అన్నదాతలు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ వెల్లడించారు. అప్పుడే తదుపరి విడత పీఎం కిసాన్ నిధులు మంజూరు అవుతాయి. పీఎం కిసాన్ కింద ఏడాదికి మొత్తం మూడు విడతల్లో రూ. 6000 జమ అవుతాయి. దీనికి ఈ కేవైసీ, ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి. ఈకేవైసీ https://pmkisan.gov.in/ పూర్తి చేసుకోవచ్చు. అయితే, ఫార్మర్ రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 18, 2026, 08:36 AM IST | Updated: Sep 18, 2026, 08:40 AM IST
Image Credit: PM Kisan AP Update
Join

PM Kisan AP Update: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ అన్నదాతలకు ఒక బిగ్ అప్‌డేట్ వచ్చింది. వీరు కూడా తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాల్సిందే. పీఎం కిసాన్ సమాన్ యోజన ద్వారా రైతులు ప్రతి ఏడాది రూ. 6000లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా పొందుతున్నారు. ఇవి మొత్తం మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున జమ అవుతాయి. తదుపరి 24వ విడత నిధులు అన్నదాతలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి. దీనికి ముందే కేవైసీ వంటి పనులను కూడా పూర్తిచేసుకుని ఉండాలి.

ఇంకా 7.34 లక్షల మంది రైతులకు పెండింగ్..
ఇటీవల ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలాని మాట్లాడుతూ, అన్నదాతలు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని వెల్లడించారు. ఈ పథకం పరిధిలో రాష్ట్రంలో మొత్తం 64.71 లక్షల మంది ఉండగా, అందులో 52.06 లక్షల మంది మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నారని తెలిపారు. మిగిలిన 7.34 లక్షల మంది రైతులు వెంటనే రైతు సేవ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అప్పుడే తదుపరి విడత నిధులు మంజూరు అవుతాయి.

ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఏమిటి?..
ప్రధానంగా పీఎం కిసాన్ నిధులు అసలైన రైతులకే అందాలని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హత లేని రైతులను పీఎం కిసాన్ జాబితా నుండి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫార్మర్ ఐడి అనేది డిజిటల్ అగ్రిస్టాక్‌ల్ రికార్డ్స్‌లో నమోదు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పీఎం కిసాన్‌లో కొనసాగాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి. ఇది రైతు యాజమాన్యాన్ని ధ్రువీకరిస్తుంది. తద్వారా తదుపరి నిధులు విడుదలైనప్పుడు వెంటనే మంజూరు అవుతాయి.

ఈ-కేవైసీ, ఫార్మర్ ఐడీ లేకపోతే..
ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఫార్మర్ ఐడి సిస్టమ్.. ఇది ఫార్మర్ రిజిస్ట్రీ లేదా అగ్రి స్టాక్ చొరవలో ఒక భాగం. ఈ ఐడి కింద లబ్ధిదారులు తదుపరి విడత నిధులను పొందుతారు. ఫార్మర్ ఐడి లేకపోయినా లేదా ఈ కేవైసీ పూర్తి చేయకపోయినా పీఎం కిసాన్ నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. కేవలం ఫార్మర్ రిజిస్ట్రీ మాత్రమే కాదు, ఈ కేవైసీ కూడా కచ్చితంగా కలిగి ఉండాల్సిందే. 24వ విడత పీఎం కిసాన్ లబ్ధిదారులు నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం లేకుండా డబ్బులు పొందాలంటే ఈ కేవైసీని పూర్తి చేయాలి. ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ నిధుల స్థితిని చెక్ చేసుకునే విధానం..
ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే నిధులు మంజూరు అవుతాయి. దీనికి సంబంధించిన వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/లో అందుబాటులో ఉంటాయి. అక్కడ మీ ఆధార్ నంబరు లేదా రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్‌తో ఓటీపీ వెరిఫికేషన్ చేస్తే మీ స్టేటస్ తెలుస్తుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES