• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /ఏపీ–తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై రచ్చ.. తెలంగాణకు వచ్చేందుకు 891 మంది, ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది సిద్ధం...పీటముడి ఎక్కడ..?

ఏపీ–తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై రచ్చ.. తెలంగాణకు వచ్చేందుకు 891 మంది, ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది సిద్ధం...పీటముడి ఎక్కడ..?

AP Telangana Employee Transfers: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Sep 29, 2026, 05:05 PM IST|Updated: Sep 29, 2026, 05:07 PM IST
joinshare
ఏపీ–తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై రచ్చ.. తెలంగాణకు వచ్చేందుకు 891 మంది, ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది సిద్ధం...పీటముడి ఎక్కడ..?
Image Credit: AP Telangana Employee Transfers:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Telangana Employee Transfers: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన 891 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ స్థానికత ఉద్యోగులను కూడా వారి సొంత రాష్ట్రానికి పంపించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

2014లోనే కమిటీ ఏర్పాటు:
రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు కోసం 2014లో కేంద్ర ప్రభుత్వం సీఆర్‌ కమలనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పాటైన ఈ కమిటీ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియకు మార్గదర్శకాలు రూపొందించింది. స్థానికత, కేడర్, ఉద్యోగుల ఆప్షన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విభజన ప్రక్రియ చేపట్టారు. అయితే, కమలనాథన్ కమిటీ  కేవలం స్టేట్ క్యాడర్ ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించారు. మిగతా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులకు ఈ అవకాశం ఇవ్వకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో అనేక మంది ఉద్యోగులకు అన్యాయం జరిగి సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది.

1,369 మంది ఏపీకి వెళ్లేందుకు సుముఖత:
తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగుల నుంచి 2021లో ఆప్షన్లు తీసుకోగా.. సుమారు 1,369 మంది ఏపీకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. అయితే అప్పటి నుంచి ఈ అంశం పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. తాజాగా ఈ వివరాలను మరోసారి పరిశీలించి, ప్రస్తుతం ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగుల నుంచి కొత్తగా ఆప్షన్లు తీసుకోవాలని ప్రతిపాదించారు.

891 మంది తెలంగాణకు రావడానికి సిద్ధం:
మరోవైపు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ  ఉద్యోగుల్లో 891 మంది తెలంగాణకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వీరి వివరాలను తెలంగాణ ప్రభుత్వానికి పంపినట్లు తాజా పత్రంలో పేర్కొన్నారు. వీరిని తెలంగాణకు తీసుకొచ్చే ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ ఇదే:
స్థానికత ఆధారంగా బదిలీలు చేపడితే ఉద్యోగుల సమస్య తీరడంతో పాటు తెలంగాణ నిరుద్యోగులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఏపీ పంపిన 891 మంది ఉద్యోగుల జాబితాలో స్థానికత ఆధారంగా చూస్తే సుమారు 350 మంది మాత్రమే తెలంగాణకు వస్తారు. అదే సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు దాదాపు 1,369 మంది సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,000 కి పైగా ఉద్యోగాలు కొత్తగా ఖాళీ అవుతాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున కొలువులు లభించే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర విభజనకు ముందు వివాహం చేసుకున్న తెలంగాణ కోడళ్లలో కొందరికి ఏపీ స్థానికత ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఏపీకి సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్నవారిని మానవతా దృక్పథంతో తెలంగాణకు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని ప్రతిపాదనలో కోరారు.

2014 నుంచి కొనసాగుతున్న సమస్య:
రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల కేటాయింపు పూర్తయినప్పటికీ.. కొంతమంది ఉద్యోగులు తమ స్థానిక రాష్ట్రానికి దూరంగా పనిచేయాల్సి వచ్చింది. దీంతో కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు, సొంత రాష్ట్రంలో స్థిరపడాలనే కోరిక వంటి కారణాలతో పలువురు ఉద్యోగులు తిరిగి తమ స్థానిక రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై ఉద్యోగ సంఘాలు కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాయి. గతంలో జరిగిన చర్చల్లో ఉద్యోగుల పరస్పర బదిలీలు, ఖాళీలు, సీనియారిటీ, పదోన్నతులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.

ఒకే వైపే చేరికలు.. రిలీవ్‌లో తీవ్ర జాప్యం:
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నుంచి పలు జీవోల ద్వారా దాదాపు 2, 400 మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ఇక్కడికి తీసుకుంది. ఇందులో 7 ముంపు మండలాలకు చెందిన 1,525 మంది (జీవో నెంబర్ 130).. 725 మంది క్లాస్ III మరియు IV ఉద్యోగులు (జీవో నెంబర్ 37) పలు  కేడర్లకు చెందిన 122 మంది ఉద్యోగులు (జీవో నెంబర్ 1412) ఉన్నారు. కానీ.. ఇప్పటి వరకు తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ స్థానికత కలిగిన ఏ ఒక్క ఉద్యోగిని కూడా తిరిగి ఏపీకి పంపించే ప్రక్రియ జరగనే లేదు. ఇలా కేవలం ఒకే వైపు నుంచే విలీనాలు జరగడం, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకుంటున్న వారిని పంపించకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకుండా అలాగే మిగిలిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

తుది నిర్ణయం ప్రభుత్వాలదే:
ప్రస్తుతం ఈ అంశం ప్రతిపాదనలు, ఉద్యోగ సంఘాల డిమాండ్ల దశలోనే ఉంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2014 నుంచి కొనసాగుతున్న ఉద్యోగుల విభజన సమస్యకు ఈసారి శాశ్వత పరిష్కారం లభిస్తుందా అనేది వేచి చూడాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
AP News
Employees