SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP ZPTC MPTC Elections 2026: పంచాయతీ ఎన్నికల సిబ్బందికి గుడ్‌న్యూస్.. రెమ్యూనరేషన్ పెంపు.. రోజుకు ఎంతంటే..?

Polling Staff Remuneration Hike: పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్నికల సిబ్బంది రెమ్యూనరేషన్, భోజన అలవెన్సులను గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Written By Ashok Krindinti
Published: Nov 04, 2026, 04:23 PM IST | Updated: Nov 04, 2026, 04:24 PM IST
Image Credit: Polling Staff Remuneration Hike (Source: AI Generated)
Join

Polling Staff Remuneration Hike: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది రెమ్యునరేషన్‌ను పెంచింది. ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్, ఆహార అలవెన్సులను పెంచుతూ పంచాయతీ రాజ్ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. భోజనం, అల్పాహారం అలవెన్స్‌ను రూ.150 నుంచి రూ.500కు పెంచుతున్నట్లు జీవోలో పేర్కొంది. మరోవైపు రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

సవరించిన రెమ్యూనరేషన్ వివరాలు ఇలా..

ప్రిసైడింగ్ ఆఫీసర్ (PO)/కౌంటింగ్ సూపర్‌వైజర్: రోజుకు రూ.500 లేదా లంప్‌సమ్ మొత్తంగా రూ.2,000
పోలింగ్ ఆఫీసర్ (APO/OPO): రోజుకు రూ.400 లేదా లంప్‌సమ్ మొత్తంగా రూ.1,600
కౌంటింగ్ అసిస్టెంట్: రోజుకు రూ.450 లేదా లంప్‌సమ్ మొత్తంగా రూ.1,350
క్లాస్-IV/ ఆఫీస్ సబార్డినేట్స్: రోజుకు రూ.350 లేదా లంప్‌సమ్ మొత్తంగా రూ.1,400
మైక్రో అబ్జర్వర్స్: లంప్‌సమ్ మొత్తంగా రూ.2 వేలు.

భోజనం, అల్పాహారం కోసం రూ.500

ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బందికి భోజనం, అల్పాహారం అందించే ఏర్పాట్ల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లంచ్, లైట్ రిఫ్రెష్‌మెంట్స్ కోసం ఉన్న రూ.150 మొత్తాన్ని 500 రూపాయలకు పెంచింది. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఆహార ఏర్పాట్ల కోసం ఈ మొత్తాన్ని కేటాయించారు. అయితే కేవలం నిధులు కేటాయించడంతో సరిపెట్టకుండా సిబ్బందికి నాణ్యమైన భోజనం, అల్పాహారం అందేలా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఎక్కడైనా భోజనం అందించకపోయినా.. నాణ్యత సరిగా లేకపోయినా సిబ్బంది వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వాలి. అవసరమైతే జిల్లా ఎన్నికల అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలి.

రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రేపు (గురువారం) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సవరించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఉన్న 44 పోలింగ్ కేంద్రాలు, పోలవరం జిల్లాలోని 7 మండలాల పరిధిలో ఉన్న మరో 44 కేంద్రాల్లో మాత్రం పోలింగ్ సమయం సాయంత్రం 3 గంటలకే ముగియనుంది. ఈ 88 కేంద్రాలకు ప్రత్యేకంగా సమయ పరిమితిని విధించారు. నవంబర్ 7న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,829 ఎంపీటీసీ స్థానాలు, 659 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్, కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి కొత్త పారితోషిక రేట్లు అమలు కానుండటంతో ఉద్యోగులకు కొంత ఊరట లభించనుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES