• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Bird Flu In Andhra Pradesh: నాన్‌-వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..ఏపీలో కోళ్లకు కొత్త రోగం..ఒకేసారి వేలాది కోళ్లు మృత్యువాత!

Bird Flu In Andhra Pradesh: నాన్‌-వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..ఏపీలో కోళ్లకు కొత్త రోగం..ఒకేసారి వేలాది కోళ్లు మృత్యువాత!

Bird Flu In Andhra Pradesh Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా సిద్ధరాపురం గ్రామంలోని ఒక కోళ్ల ఫారమ్‌లో ఒకేసారి 2,000 పైగా కోళ్లు చనిపోవడం ఇప్పుడు నాన్‌వెజ్ ప్రియుల్లో భయబ్రాంతులను గురిచేస్తుంది. ఇప్పటికే చనిపోయిన కోళ్ల నమూనాను భోపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్‌కు పంపించగా అది బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయ్యింది. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు వైరస్ వేగంగా విస్తరించకుండా తగిన నివారణ చర్యలు చేపడుతున్నారు.

Written ByHarish Darla
Published: Oct 05, 2026, 12:22 PM IST|Updated: Oct 05, 2026, 12:28 PM IST
joinshare
Bird Flu In Andhra Pradesh: నాన్‌-వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..ఏపీలో కోళ్లకు కొత్త రోగం..ఒకేసారి వేలాది కోళ్లు మృత్యువాత!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
20 ఏళ్ల తర్వాత కూడా సూపర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? ఈ చిన్న మార్పులు చేయండి చాలు!

20 ఏళ్ల తర్వాత కూడా సూపర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? ఈ చిన్న మార్పులు చేయండి చాలు!

2

Meerut Wife Hanging: కారులో వేరే మహిళతో భర్త చాటుమాటు యవ్వారం..భార్య అడ్డుపడితే కారు బోనె‌ట్‌పై ఈడ్చుకెళ్లి..

3

KBR పార్కు ప్రాజెక్టు రద్దు.. గుంతల పూడ్చివేత.. ఎలివేటెడ్ కారిడార్ పై దృష్టి..

4

Russia Pneumonic Plague: రష్యాలో మరో భయంకరమైన వ్యాధి..? 5 ఆస్పత్రులు క్లోజ్.. 200 మంది క్వారంటైన్..!

5

మందు బాబులకు షాక్.. తెలంగాణలో నేటి నుంచి బార్ అండ్ రెస్టారెంట్స్ బంద్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bird Flu In Andhra Pradesh Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పరిధిలోని సిద్ధరాంపురం గ్రామంలో ఒక్కసారిగా వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కోళ్లు చనిపోయాయని నిర్ధారణ వచ్చిన నేపథ్యంలో స్థానికంగా పెద్ద ఎత్తున తీవ్ర కలకలం సృష్టించింది. 

ఆ గ్రామంలోని ఒక కోళ్ల ఫారమ్‌లో స్వల్ప వ్యవధిలోనే ఒకేసారి ఏకంగా రెండు వేలకు పైగా కోళ్లు వరుసగా మృత్యువాత పడ్డాయి. అంత స్వల్ప వ్యవధిలోనే భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో తీవ్ర అనుమానం వచ్చిన ఫారమ్ యజమాని, తక్షణమే ఈ విషయాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు అత్యంత వేగంగా స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి ప్రాథమిక తనిఖీల కొరకు మొదట విజయవాడలోని ల్యాబొరేటరీకి తరలించారు. విజయవాడ ల్యాబ్ నుండి లభించిన సమాచారం ఆధారంగా, ఈ విషయంపై మరింత ఖచ్చితమైన స్పష్టత సాధించేందుకు ఆ శాంపిల్స్‌ను భోపాల్‌లోని 'హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబొరేటరీ'కి పంపించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక వైద్య పరీక్షలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

పరీక్షల ఫలితాలు పాజిటివ్‌గా రావడంతో ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నిరోధించడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ నుండి ప్రత్యేక అధికారుల బృందం నేరుగా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన జరిపింది. 

పశుసంవర్ధక శాఖ అధికారులు సిద్ధరాంపురం, దాని పరిసర ప్రాంతాలలో ప్రత్యేక అవగాహన ర్యాలీని నిర్వహించి, కోళ్ల ఫామ్‌ల యజమానులకు, స్థానిక గ్రామస్తులకు పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరంగా తెలియజేశారు.

ప్రజలు ఈ విషయంలో అనవసరంగా ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, చికెన్, గుడ్లను సంపూర్ణంగా ఉడికించి మాత్రమే తినాలని అధికారులు సూచించారు. 

కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త తెలుసుకున్న నాన్-వెజ్ ప్రియులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. దీనితో వారు చికెన్ కొనుగోలును తగ్గిస్తూ, దానికి ప్రత్యామ్నాయంగా సీ ఫుడ్స్ (సముద్ర ఆహారాలు) కొనుగోలు చేయడంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Telugu News