• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /మీ లివర్‌ను ఉక్కులా మార్చే 5 అద్భుతమైన దుంప కూరగాయలు.. వీటిని తింటే ఫ్యాటీ లివర్ పరార్!

మీ లివర్‌ను ఉక్కులా మార్చే 5 అద్భుతమైన దుంప కూరగాయలు.. వీటిని తింటే ఫ్యాటీ లివర్ పరార్!

కాలేయం మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది విష పదార్థాలను బయటకు పంపుతుంది. అంతేకాదు ఖనిజాలను ప్రాసెస్‌ చేసి లివర్‌ పనితీరును మెరుగు చేస్తుంది. ఈ 5 దుంపలు తింటే కాలేయ ఆరోగ్యం బాగుంటుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 26, 2026, 15:31 IST|Updated: Nov 26, 2026, 15:33 IST
joinshare
మీ లివర్‌ను ఉక్కులా మార్చే 5 అద్భుతమైన దుంప కూరగాయలు.. వీటిని తింటే ఫ్యాటీ లివర్ పరార్!
Image Credit: Root Vegetables for Liver Health:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మీ లివర్‌ను ఉక్కులా మార్చే 5 అద్భుతమైన దుంప కూరగాయలు.. వీటిని తింటే ఫ్యాటీ లివర్ పరార్!

మీ లివర్‌ను ఉక్కులా మార్చే 5 అద్భుతమైన దుంప కూరగాయలు.. వీటిని తింటే ఫ్యాటీ లివర్ పరార్!

2

Adilabad: ప్రేమిస్తే చంపేస్తారా..?.. తెలంగాణలో మరో పరువు హత్య కలకలం.. నిద్రలో ఉన్న కూతురి గొంతు పిసికి మరీ.!.

3

Vivo X500 వచ్చేసింది.. AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, అదిరిపోయే ఫీచర్లు!

4

200MP కెమెరా, 7800mAh బ్యాటరీ.. వివో X500 ప్రో మ్యాక్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

5

Rajamouli Varanasi OTT Deal: మహేశ్ బాబు 'వారణాసి'కి ఓటీటీలో కళ్లు చెదిరే ఆఫర్.. డిజిటల్ హక్కుల ధర తెలిస్తే షాక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Root Vegetables for Liver Health: మన శరీరంలో అన్ని అవయవాలు కీలకం. వీటి ఆరోగ్యానికి విటమిన్స్‌, ఖనిజాలు ఉండే ఫుడ్స్‌ రోజువారీ తీసుకోవాలి. ఏ విటమిన్‌ తక్కువైనా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది అవయవాలకు కూడా కీలకం. అయితే, ఓ 5 రకాల దుంపలు మీ డైట్‌లో చేర్చుకుంటే కాలేయ ఆరోగ్యం బాగుంటుంది. ఈ లివర్‌ శరీరంలో నుంచి టాక్సిన్స్‌ బయటకు పంపుతుంది. ఖనిజాలను ప్రాసెస్‌ చేస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. సాధారణంగా మన శరీరంలో సొంతగా డిటాక్సిఫికేషన్‌ వ్యవస్థ ఉంటుంది. కానీ, కొన్ని రకాల దుంప జాతి కూరగాయలను డైట్‌లో చేర్చుకుంటే కాలేయ పనితీరు కూడా మెరుగవుతుంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబర్‌, విటమిన్స్‌, ఖనిజాలు కలిగి ఉంటాయి. ఇది సూపర్‌ ఫుడ్స్‌.. డైలీ చేర్చుకుంటే మంచిది.

బీట్‌రూట్‌..
బీట్‌రూట్‌ అందానికి కూడా మేలు చేస్తుంది. ఇది కాలేయ పనితీరును కూడా మెరుగు చేస్తుంది. ఈ బీట్‌రూట్‌లో బెటాలైన్స్‌ ఉంటాయి. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. ఈ బీట్‌రూట్‌ లివర్ క్లీన్‌ చేయడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో సహజంగా క్లెన్సింగ్‌ గుణాలు ఉంటాయి. జీర్ణ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. బాడీలో నుంచి అనవసర వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. ఈ బీట్‌రూట్‌ జ్యూస్‌ లేదా సలాడ్‌లో యాడ్‌ చేసుకుని తీసుకోవచ్చు.

ర్యాడిష్‌.. 
ర్యాడష్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఖనిజాలు పుష్కలంగా జీర్ణ ఆరోగ్యానికి కూడా సహాయపడే గుణం ఉంటుంది. ఇందులో కాలేయం, గాల్‌బ్లాడర్‌ పనితీరును మెరుగు చేసే సమ్మేళనాలు ఉంటాయి. మన శరీరంలో నుంచి విషపదార్థాలు బయటకు పంపించే సహజ డైరుటిక్‌ లక్షణాలు ఉంటాయి. ర్యాడిష్‌ కట్‌ చేసి తినాలి సలాడ్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.

క్యారట్స్‌..
క్యారట్‌లో కూడా బీటా కెరోటీన్‌ ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్‌ ఏ గా మారుతుంది. క్యారట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ కాలేయ కణాలను రక్షించే గుణం కలిగి ఉంటాయి. ఫ్రీ ర్యాడికల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. ఈ క్యారెట్స్‌ జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. క్యారెట్‌లను పచ్చిగా లేదా ఉడికించి సూప్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.

చిలగడ దుంప..
చిలగడ దుంపలో ఫైబర్‌, విటమిన్‌ సీ, బీటా కెరోటీన్‌ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ మంట సమస్యు తగ్గించి కాలేయ ఆరో్యానికి పనిచేస్తాయి. చిలగడదుంపలో ఉండే కార్బొహైడ్రేట్స్‌ తక్షణ శక్తి అందిస్తుంది. గట్‌ ఆరోగ్యానికి కూడా ఇవి ప్రేరేపిస్తాయి. సహజమైన డిటాక్సిఫికేషన్‌ లక్షణాలు ఇందులో కలిగి ఉంటాయి.

టర్నిప్‌..
ఇందులో కూడా ఫైబర్‌ పుష్కలం. జీర్ణ ఆరోగ్యానికి, మెటబాలిజం ఆరోగ్యానికి సహాయపడతాయి. టర్నిప్‌లో విటమిన్‌ సీ ఆక్సిడేటివ్‌ డ్యామేజ్‌ కాకుండా కణాలను కాపాడుతుంది. ఇది ఒక సమతులమైన ఆహారం అవుతుంది. లివర్‌ పనితీరు మెరుగు చేస్తుంది.

దుంప జాతి కూరగాయల బెనిఫిట్స్‌..
దుంప జాతి కూరగాయలు వారంలో ఒకసారి మీ డైట్‌లో చేర్చుకోవాలి. వీటిని ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఫుడ్స్‌తో కలిపి తీసుకోవాలి. ఇవి ఖనిజాలు గ్రహించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. దుంపలను వేయించి, ఉడికించి, గ్రిల్‌ లేదా డీప్‌ఫ్రై కూడా చేసి తీసుకోవచ్చు. ఇవి మన శరీరానికి రోజంతటికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తాయి. సహజంగా డిటాక్స్‌ చేస్తాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health
Telugu News