SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఒకవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు తుపాను బాధితులకు భరోసా!

Bheemili News: కొన్ని విపత్కర పరిస్థితులు రాజకీయ నాయకుడిలోని స్వాభావాన్ని బయట పెడుతూ ఉంటాయి.. అయితే, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేస్తూ.. అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను అదుకుంటూ వస్తోంది బొత్స అనూష.. తీర ప్రాంతాల్లో పర్యటిస్తూ.. బాధితులకు ధైర్యం చెబుతూ వస్తోంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 28, 2026, 02:59 PM IST | Updated: Oct 28, 2026, 03:01 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Bheemili Telugu News: రాజకీయ నాయకుడి నిజమైన స్వాభావం అధికారంలో ఉన్నప్పుడు కాదు.. ఒకేసారి ఎన్నికల పోరుతో పాటు ఏదైనా ఊహించని సంక్షోభం ఎదురైనప్పుడే బయటపడుతూ ఉంటుంది. సరిగ్గా ఇదే అంశాన్ని క్షేత్రస్థాయిలో నిజం చేస్తూ.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు బొత్స అనూష.. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. వచ్చిన రాజకీయ విమర్శలను పక్కనపెట్టి.. చేతలతోనే సమాధానం చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్నారు..

విశాఖ జిల్లాలోని రాజకీయ ప్రాధాన్యత కలిగిన భీమిలి సమన్వయకర్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన అనూషపై మొదట్లో రకరకాల ప్రశ్నలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే, ఇదే సమయంలో ఆలోచనా విధానంతో ఆమె నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. ఇంతలోనే స్థానిక సంస్థల ఎన్నికలు తెరపైకి రావడం.. విజయనగరం జిల్లా బొండపల్లి జడ్పీటీసీ అభ్యర్థిగా అధిష్ఠానం ఆమెను బరిలోకి దించడం చకచకా సాగిపోయాయి.. పార్టీ ఆదేశాన్ని పాటిస్తూ.. వెంటనే బొండపల్లి పల్లెల్లో సుడిగాలి పర్యటనలు మొదలు పెట్టారు.. ముద్దూరు సహా గ్రామం గ్రామాన్నీ పలకరిస్తూ.. 24 గంటల వాట్సాప్ గ్రీవెన్స్ వంటి వినూత్న పాలనాతో కూడిన ఆలోచనలతో గ్రామీణ ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేశారు.

ఎన్నికల పోరు సాగుతున్న కీలక సమయంలో తీరప్రాంతాన్ని తుపాను ముంచెత్తింది.. సాధారణంగా ఎన్నికల సమయంలో ఏ నాయకుడైనా ప్రచారాన్ని వదిలి.. ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడరు. అయితే, అనూష తక్షణమే స్పందించి.. భీమిలికి వెళ్లారు. తీరప్రాంత మత్స్యకార పల్లెలతో పాటు లోతట్టు గ్రామాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.

అలాగే మత్స్యకారుల బోట్లతో పాటు వలలు భద్రపరచడం నుంచి లోతట్టు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే వరకు అనేక సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు.. బాధితులకు తాగునీరుతో పాటు ఆహారం, వైద్యం సకాలంలో అందేలా స్థానిక క్యాడర్‌ను కూడా అప్రమత్తం చేశారు. ఓట్ల రాజకీయం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని నిరూపించిన ఈ తీరు క్షేత్రస్థాయిలో విశేష ఆదరణ పొందింది.

ఇక ఒకవైపు బొండపల్లిలో ఎన్నికల పనులను నడిపిస్తూ.. మరోవైపు భీమిలి ప్రజలకు ఆపదలో ఇంటి మనిషిగా నిలబడటం ఆమె అద్భుతమైన నాయకత్వానికి అద్దం పడుతూ వస్తోంది.. పదవులు ఎలా ఉన్నా.. సంక్షోభ సమయంలో నిలబడే వారికే ప్రజల గుండెల్లో స్థానం దక్కుతుందన్న విషయాన్ని ఆమె మంచితనం చాటిచెబుతోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES