• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /ఇంటి వెనుక పెరట్లోనే గంజాయి పెంపకం.. ఎక్సైజ్ అధికారులు ఏం చేశారంటే?

ఇంటి వెనుక పెరట్లోనే గంజాయి పెంపకం.. ఎక్సైజ్ అధికారులు ఏం చేశారంటే?

Peddapalli News: ఇంటి వెనుక పెరట్లోనే గంజాయి పెంచుతున్న ఓ నిందుతుడిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 28, 2026, 04:18 PM IST|Updated: Oct 28, 2026, 04:19 PM IST
joinshare
ఇంటి వెనుక పెరట్లోనే గంజాయి పెంపకం.. ఎక్సైజ్ అధికారులు ఏం చేశారంటే?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
మోటరోలా Signature 27 వచ్చేస్తోంది.. 50MP Sony LYTIA కెమెరా, ప్రీమియం డిజైన్‌తో అదరగొట్టే ఫీచర్లు!

మోటరోలా Signature 27 వచ్చేస్తోంది.. 50MP Sony LYTIA కెమెరా, ప్రీమియం డిజైన్‌తో అదరగొట్టే ఫీచర్లు!

2

Smith Machar UAE Honor: భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ ఘన సత్కారం..మెడల్ ఇచ్చి సత్కరించిన దుబాయ్ యువరాజు!

3

Pawan Kalyan: యుద్ద ప్రాతికన సహాయక చర్యలు చేపట్టాలి.. అర్నబ్ తుపాన్‌పై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..

4

ఇంటి వెనుక పెరట్లోనే గంజాయి పెంపకం.. ఎక్సైజ్ అధికారులు ఏం చేశారంటే?

5

Diwali DA hike 2026: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..3 శాతం డీఏ పెంపునకు కేబినేట్ ఆమోదం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Peddapalli News: గ్రామీణ ప్రాంతాల్లో యువత మత్త పదార్థాలకు బానిసలు కాకుండా ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకున్నప్పటికీ.. కొంతమంది మాత్రం గంజాయి లాంటి మత్తు పదార్థాలను అక్రమంగా పండించి విక్రయిస్తూ వస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో గంజాయి సాగు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఇంటికి చాలా దగ్గరలోనే ఉన్న పెరట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న ముఠాల అక్రమ వ్యాపారంపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా భారీగా గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సాగు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి తన నివాస ప్రాంగణంలోనే గంజాయిని అక్రమంగా సాగు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది.. దీంతో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ తక్షణమే అప్రమత్తమై రంగంలోకి దిగింది. టాస్క్‌ఫోర్స్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్  ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం కొత్తపల్లిలోని సదరు అనుమానిత నివాసంపై ఒక్కసారిగా మెరుపు దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది..

అధికారులు ఇల్లంతా తనిఖీ చేయగా.. పెరట్లో సాగు చేసిన పచ్చి గంజాయి మొక్కలతో పాటు.. కోసి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన ఎండిపోయిన మొక్కలును గుర్తించారు. ఈ దాడుల్లో నిందితుడి వద్ద నుంచి మొత్తం 8 ఎండిన గంజాయి మొక్కలతో పాటు.. రెండు పచ్చి గంజాయి మొక్కలను ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేసిన్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తూ.. యువతకు, స్థానికంగా ఉన్న ముఠాలకు చేరవేసే లక్ష్యంతోనే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.

అయితే, నిందితుడిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు.. అతనిపై ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌లో భాగంగా న్యాయస్థానంలో హాజరుపరిచిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో టాస్క్‌ఫోర్స్ ఏఈఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Karimnagar
Telugu News