• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Arnab Cyclone: తుఫాన్‌ బాధితులు కోలుకునేదాకా ప్రజలకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

Arnab Cyclone: తుఫాన్‌ బాధితులు కోలుకునేదాకా ప్రజలకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu Tele Conference On Arnab Cyclone: అర్నాబ్‌ తుఫాన్‌ ధాటికి సర్వం కోల్పోయిన బాధితులు కోలుకునే దాకా తాము అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు చేశారు. తక్షణమే పునరద్ధరణ పనులు చేయాలని ఆదేశించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 29, 2026, 05:34 PM IST|Updated: Oct 29, 2026, 05:36 PM IST
joinshare
Arnab Cyclone: తుఫాన్‌ బాధితులు కోలుకునేదాకా ప్రజలకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
Image Credit: Source: AP CMO X (Twitter)

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IND Vs NZ 4th T20 Playing 11: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. తుది జట్టులో భారీ మార్పులు..!

IND Vs NZ 4th T20 Playing 11: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. తుది జట్టులో భారీ మార్పులు..!

2

కొత్త నిర్మాతలకు అండగా మెగాబ్రదర్.. ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ చేసిన నాగబాబు..

3

High Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

4

Anirudh Ravichander: కావ్య మారన్ – అనిరుధ్ రిసెప్షన్‌కు టాలీవుడ్ నుంచి ఆ ఒక్క హీరోకే ఆహ్వానం!

5

Arnab Cyclone: తుఫాన్‌ బాధితులు కోలుకునేదాకా ప్రజలకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Arnab Cyclone Review: అర్నబ్ తుఫాన్‌.. అది సృష్టించిన బీభత్సంపై సీఎం చంద్రబాబు అప్రమత్తంగా ఉన్నారు. తుఫాన్‌ బాధితులకు సాధ్యమైనంత సహాయం చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు విశ్రమించొద్దని అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు. కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొంది అని తెలిపారు. తుఫాన్ నష్టంపై ఇవాళ ప్రాథమిక నివేదికను అందిస్తామని అధికారులు తెలిపారు. పంట నష్టం మినహా బాధితులందరికీ నష్టపరిహారాన్ని అందించే పనిని వేగవంతం చేయాలని ఆదేశించారు.అర్నబ్ తుఫాన్ సమయంలో అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేసింది

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితులు, పునరుద్దరణ పనులపై వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. అనంతరం మాట్లాడుతూ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందులు. మిగిలిన ప్రాంతాల్లో అర్నబ్ తుఫాన్ వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ రెండింటి విషయంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించి ప్రజలను ఆదుకోవాలి' అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమలో పంటలు వేసుకునే పరిస్థితి లేదని.. ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లో వేసుకున్న పంటలను, కొబ్బరి చెట్లను నష్టపోయిన దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.

'పక్కా ప్రణాళికతో ఈ ప్రకృతి విపత్తుల బారీ నుంచి ప్రజలను బయటపడేయాలి. అర్నబ్ తుఫాన్‌తో ప్రాణ, ఆస్తి నష్టం వీలైనంత మేర తగ్గించేలా చూశాం. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పడిపోయిన చెట్లను ఇప్పటికే చాలావరకు తొలగించాం. ఇంకా ఎక్కడైనా పడిపోయిన చెట్లు రోడ్లపై ఉంటే వాటిని వెంటనే తొలగించాలి' అని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తుఫాన్ కారణంగా పోగైన చెత్తను కూడా తీసేయాలని.. రేపటిలోగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని ఆదేశించారు.

'నష్ట పరిహారానికి సంబంధించిన అంశాలపై జీవో జారీ చేశాం. పంట నష్టం మినహా బాధితులకు నష్టపరిహరం అందించాలి. త్వరగా తుఫాన్ నష్టంపై అంచనాలు సిద్దం చేయాలి. నీట మునిగిన పంటలను ఏ మేరకు కాపాడగలమో చూడాలి. దీనిపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు అధ్యయనం చేయాలి' అని సీఎం చంద్రబాబు సూచించారు. పంట మట్టిపాలు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఆలోచించాలని.. కొబ్బరి చెట్లు సహా వివిధ ఉద్యాన పంటలకు చెందిన చెట్లు, మొక్కలను తిరిగి ప్లాంట్ చేయగలిగే పరిస్థితులు ఉన్నాయా అనే అంశాన్నీ పరిశీలించాలని చెప్పారు.

'తుఫాన్ బాధిత వ్యవసాయ, ఉద్యాన రైతులకు వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయడానికి వివిధ పథకాలలను వర్తింప చేయాలి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొనేంత వరకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలవాలి. ప్రభుత్వం చేసే పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాలి.. అప్పుడే ప్రజల నుంచి సహకారం లభిస్తుంది. త్వరితగతిన పంట నష్టం అంచనాలను సిద్దం చేసేందుకు టెక్నాలజీని వినియోగించాలి' అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Chandrababu Naidu
AP News
Telugu News
Rain News