• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /రేపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన..

రేపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన..

CM Chandrababu Visit Repalle: సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా రేపల్లె పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు.. పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 01, 2026, 10:57 AM IST|Updated: Oct 01, 2026, 11:00 AM IST
joinshare
రేపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన..
Image Credit: CM Tour (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CM Tour: ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరుతారు. 11 గంటలకు రేపల్లెకు చేరుకుంటారు. అనంతరం రేపల్లె పట్టణంలోని నాలుగో వార్డులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకోనున్నారు.

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ అందించనున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లను సకాలంలో అందించడంపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారులను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పింఛన్ పంపిణీతో పాటు..లబ్ధిదారుల కుటుంబ పరిస్థితులు, వారికి అందుతున్న ఇతర సంక్షేమ పథకాలపై కూడా సీఎం ఆరా తీయనున్నారు.

బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు.. 
మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రేపల్లెలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పేదల కోసం అమలు చేస్తున్న పథకాలు, వాటి ద్వారా లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను వివరించే అవకాశం ఉంది. రేపల్లె ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు పంపిణీచేయనున్న సీఎం..
అనంతరం మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాలకు రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, స్థానికంగా ఎదురవుతున్న అంశాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై నేతలతో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులతో సీఎం సమావేశం కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

రేపల్లె పర్యటనలో సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. మొత్తంగా పేదల సేవలో కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు.. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడేందుకు సీఎం రేపల్లె పర్యటన వేదిక కానుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Chandrababu Naidu
AP News
Andhra Pradesh
Telugu News