SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీకి అతి భారీ వర్షాలు..

Low Pressue in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో వరుస తుపానులు ముంచెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆర్నబ్ తుపాను వణికిస్తే.. ఇపుడు మురాసు బెంబేలెత్తేస్తుంది. మొత్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 31, 2026, 07:30 AM IST | Updated: Oct 31, 2026, 08:14 AM IST
Image Credit: AP Rain Effect (X/Source)
Join

Andhra Pradesh Rains: ఆంధ్ర ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  దీని ప్రభావంతో రానున్న 3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ రోజు  మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన..
అర్నబ్ తుపాను ప్రభావిత జిల్లాల్లో నేడు, రేపు కేంద్ర బృందం పర్యటించనుంది. ముఖ్యంగా  కాకినాడ, ఉమ్మడి గోదావరి, కోనసీమ జిల్లాల్లో తుపాను నష్టాలను పరిశీలించనున్న బృందం. క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనా వేయనున్నారు. ఇందులో  ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం మొత్తం నష్టాన్ని పరిశీలించనుంది.  తుపాను సమయంలో చర్యలు, నష్టాలు కేంద్ర బృందానికి సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో ఈ రోజు వివరించనున్న అధికారులు.

అత్యధిక వర్షపాతం.. 

ఈ రోజు ఉదయం వరకు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో దార్లపూడిలో అత్యధికంగా 97.75 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు అయింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమలో నగరంలో 92.25 మి.మీ.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 81.5 మి.మీ.. అనకాపల్లి చోడవరంలో 81.5 మి.మీ వర్షపాతం.. కాకినాడ జిల్లా కరపలో 76.96 మి.మీ వర్షపాతం నమోదు అయినట్టు ఏపీ వాతావరణ విభాగం తెలిపింది.  ఇప్పటికే వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో ప్రత్యేక పునరావాస చర్యలు చేపడుతున్నారు.  

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES