SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Pawan Kalyan: యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి.. అర్నబ్ తుపాన్‌పై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..

Arnab cyclone impact on ap: ఏపీలో అర్నాబ్ తుపాన్ ప్రభావంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 28, 2026, 04:41 PM IST | Updated: Oct 28, 2026, 04:56 PM IST
Image Credit: pawan kalyan (file)
Join

Pawan kalyan key orders to officials on arnab cyclone effect: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అర్నాబ్ తుపాన్ గా మారి  ఏపీని అల్లకల్లోలం చేసింది. ఈక్రమంలో ఎక్కడ చూసిన రోడ్లన్నిజలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపై చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. ప్రజల జీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతే కాకుండా తుపాన్ ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. మరోవైపు తుపాన్ యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో తుపాను తీరం దాటినట్లు  వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాన్ తీరందాటిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం సూచించింది. 

మరోవైపు అర్నాబ్ తుపాన్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏపీలో అర్నాబ్ ప్రభావం తగ్గే వరకు యంత్రాంగమంతా క్షేత్ర స్థాయి విధుల్లోనే ఉండాలని సూచించారు. అర్నబ్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని సూచించారు. 

దెబ్బ తిన్న రహదారులు, విద్యుత్, తాగునీటి సరఫరా పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చెరువుల గట్లు, వాగులు, వంకల్లో వరద ప్రవాహంపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పంటలు, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని త్వరితగతిన అంచనా వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 

ముఖ్యంగా తుపాను తీరం దాటిన డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది పరిసర ప్రాంతాలు, కాకినాడ జిల్లా లోని తీర ప్రాంతంలో పరిస్థితులు, తుపాను తాకిడికి సంభవించిన నష్టం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావం తగ్గు ముఖం పట్టాక పంట నష్టం వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని దిశా నిర్దేశం చేశారు.

ఉప్పాడ తీర ప్రాంతంలో నిర్మించిన రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న అంశాన్ని ప్రస్తావించి వివరాలు తెలుసుకున్నారు. ఉప్పాడ తీరం వెంబడి ఇళ్లు ఏమైనా దెబ్బతిన్నాయా అన్న అంశాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఆస్తి నష్టం, పంట నష్టం, పునరావాస కేంద్రాల నిర్వహణ, దెబ్బతిన్న సౌకర్యాల పునరుద్ధరణ తదితర అంశాలపై అధికారులకు పవన్ కళ్యాన్  దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా అధికారులు తుపాను పరిస్థితిని వివరిస్తూ... అర్థరాత్రి 1.20 నుంచి యానాంకు దక్షిణంగా అర్నబ్ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమై, ఉదయం  వరకు కొనసాగిందన్నారు. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపారు. గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగాన్ని చేరుకున్నాయని వివరించారు. 

బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లా ల్లోనూ పెనుగాలులు విధ్వంసం సృష్టించాయని, గాలులు తాకిడికి భారీ వృక్షాలు రోడ్లపై కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. విద్యుత్ స్థంభాలు కూలడం, వైర్లు తెగిపోవడం కారణంగా ఆయా జిల్లాల పరిధిలో విద్యుత్ సరఫరా దాదాపు నిలిపివేసినట్టు చెప్పారు.


గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరంతో పాటు ఏజెన్సీ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నట్టు వివరించారు.ఒక్క తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనే 93 రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 736 చెట్లు నేలకొరిగినట్టు సమాచారం ఉంది. యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించే ప్రయత్నం చేయాలని సూచనలు చేశారు. వాగులు, వంకల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES