• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /KTR: నిజం నిలకడ మీదే తేలుతుంది.. మాజీ మంత్రి కొండా సురేఖ ట్విట్ పై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

KTR: నిజం నిలకడ మీదే తేలుతుంది.. మాజీ మంత్రి కొండా సురేఖ ట్విట్ పై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

Ktr reacts on Konda Surekha apology: మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన ట్విట్ పై కేటీఆర్ మాట్లాడుతూ ఇంకా క్షమాపణలు చెప్పే వాళ్లు చాలా మంది ముందు వరుసలో ఉన్నారన్నారు. అంతే కాకుండా నిజం నిలకడమీద తెలుతుందన్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 29, 2026, 07:36 PM IST|Updated: Oct 29, 2026, 07:47 PM IST
joinshare
KTR: నిజం నిలకడ మీదే తేలుతుంది.. మాజీ మంత్రి కొండా సురేఖ ట్విట్ పై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..
Image Credit: ktr responds konda surekha tweet

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
YS Jagan: చంద్రబాబువన్ని తప్పుడు లెక్కలు.. అర్నబ్ తుపాన్ ప్రభావంపై  వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan: చంద్రబాబువన్ని తప్పుడు లెక్కలు.. అర్నబ్ తుపాన్ ప్రభావంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

2

Chandrababu: అర్నాబ్‌ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన.. బాధితులతో ముఖాముఖి

3

Invest Telangana: రండి పెట్టుబడులు పెట్టండి.. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం

4

KTR: నిజం నిలకడ మీదే తేలుతుంది.. మాజీ మంత్రి కొండా సురేఖ ట్విట్ పై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

5

Armenian parliament video: స్ట్రీట్ ఫైటర్లుగా మారిన ఎంపీలు.. పార్లమెంట్‌లోనే డిష్యూం.. డిష్యూం.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ktr responds on Konda Surekha apologize tweet: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ చేసిన ట్విట్ హట్ టాపిక్ గా మారింది. గతంలో కేటీఆర్ పై, కేసీఆర్ కుటుంబం పై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు. అంతే కాకుండా అపోసిషన్ పార్టీల నేతల్ని విమర్శించే క్రమంలో గతంలో ఆ వ్యాఖ్యల్ని చేశానన్నారు. నిజాలు తెలుసుకొకుండా తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా  తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు.  ఈ క్రమంలో కొండా సురేఖ చేసిన ట్విట్  తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం  మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరిచుకుంది.

 

కొండా సురేఖ క్షమాపణలపై స్పందించిన కేటీఆర్ నిజం నిలకడ మీదే తేలుతుంది మొన్న ఒక వార్తాపత్రిక క్షమాపణ చెప్పింది.. ఈరోజు ఈ మేడం చెప్పింది ఇంకా క్షమాపణలు చెప్పే వాళ్లు చాలా మంది ముందు వరుసలో ఉన్నారు మా మీద ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసే వారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్తారు - కేటీఆర్

— Telugu Scribe (@TeluguScribe) October 29, 2026

 

 గత కొన్ని రోజులుగా కొండా సురేఖ సైలెంట్ గా ఉంటూ ఒక్కసారిగా కేటీఆర్ పై ట్విట్ చేయడం వెనుక అసలు మతలబు ఏంటని రాజకీయాల్లో సరికొత్త చర్చలు తెరమీదకు వచ్చాయి.  దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.  మొన్న ఒక వార్తాపత్రిక తన పై  చేసిన అసత్య ప్రచారంకు, ప్రచురణకు క్షమాపణ చెప్పిందని గుర్తు చేశారు. అదే విధంగా ఈరోజు ఈ మేడం సారీ చెప్పారన్నారు.  

అంతే కాకుండా.. నిజం అనేది నిలకడ మీద తెలుస్తుందన్నారు. ఇంకా క్షమాపణలు చెప్పే వాళ్లు చాలా మంది ముందు వరుసలో ఉన్నారన్నారు. తమపై ఫోన్ టాపింగ్, ఫార్మూలా ఈ రేసింగ్ స్కామ్ అని, విద్యుత్ కుంభకోణం అంటూ చాలా ఆరోపణలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. మా మీద ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసే వారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్తారంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. తమపై చేసిన ఆరోపణలన్ని దూదిపింజల్లాగా తెలిపోతాయన్నారు. కొండా సురేఖ తనపై చేసిన ట్విట్ చూసి లీగల్ టీమ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
KTR
Konda Surekha
Telangana News
Revanth Reddy