• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Raptadu Case: రాప్తాడు నిందితుడి కుడికాలు తొలగింపు.. కోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి సర్జరీ

Raptadu Case: రాప్తాడు నిందితుడి కుడికాలు తొలగింపు.. కోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి సర్జరీ

Raptadu Case:ఆంధ్రప్రదేశ్‌లోని రాప్తాడులో పదో తరగతి బాలికపై రంపంతో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రధాన నిందితుడు హేమంత్ కుడికాలును వైద్యులు తొలగించారు. కాలికి రక్తప్రసరణ నిలిచిపోవడంతో గ్యాంగ్రీన్ ఏర్పడటం, ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉండటంతో కోర్టు అనుమతితో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు.

Written ByVishnu Priya
Published: Nov 03, 2026, 10:01 AM IST|Updated: Nov 03, 2026, 10:10 AM IST
joinshare
Raptadu Case: రాప్తాడు నిందితుడి కుడికాలు తొలగింపు.. కోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి సర్జరీ

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్.. టీచర్లు వరుసగా లీవ్‌లు పెడితే చర్యలు తప్పవు..!!

రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్.. టీచర్లు వరుసగా లీవ్‌లు పెడితే చర్యలు తప్పవు..!!

2

ధనవంతులు కావడానికి చాణక్యుడు చెప్పిన 5 ముఖ్య సూత్రాలు..

3

మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు..

4

దీపావళి నుంచి ఈ 4 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం.. పట్టిందల్లా బంగారమే.. భారీగా ధనలాభాలు!

5

Raptadu Case: రాప్తాడు నిందితుడి కుడికాలు తొలగింపు.. కోర్టు ఆదేశాలతో అర్ధరాత్రి సర్జరీ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Raptadu Case: పోలీసుల కాల్పుల్లో హేమంత్ కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి. బుల్లెట్లు తగలడంతో మోకాలి భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. గాయాల కారణంగా కాలికి రక్తప్రసరణ కూడా నిలిచిపోయింది. దీంతో కాలిలో గ్యాంగ్రీన్ ఏర్పడింది. ఈ పరిస్థితిని అలాగే వదిలేస్తే శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.

అంతేకాకుండా, గ్యాంగ్రీన్ కారణంగా ఇతర కణజాలాలు దెబ్బతిని ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో నిందితుడి ప్రాణాలను కాపాడేందుకు కుడికాలును తొలగించాలని నిర్ణయించారు. కోర్టు అనుమతితో అర్ధరాత్రి తర్వాత అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి మోకాలి కింది భాగాన్ని తొలగించారు.

ఇదిలా ఉండగా, బాలికపై దాడి చేసిన అనంతరం హేమంత్ అక్కడి నుంచి పారిపోయాడు. అతను ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్లారు. అయితే, పోలీసులకు లొంగిపోకుండా కత్తితో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో హేమంత్ కాలికి పలు బుల్లెట్లు తగిలాయి. అనంతరం పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఎడమకాలికి కూడా గాయాలు కావడంతో దానిపై మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని సమాచారం.

రాప్తాడు బాలికపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Read More: Cyclone Murasu: తీరం వైపు దూసుకొస్తున్న పెను తుపాను.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

 

Read More: AP Municipal Elections: ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికలు..మేయర్‌, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్ జీతం ఎంతో తెలుసా?
 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Crime News