• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Alla Nani: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో మృతి

Alla Nani: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో మృతి

Alla Nani Passes Away With Heart Stroke After Resign To YSRCP: ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పొందారు. రాజకీయాల నుంచి వైదొలిగిన కొన్ని రోజులకు ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో ఏపీలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 15, 2026, 02:02 PM IST|Updated: Sep 15, 2026, 02:18 PM IST
joinshare
Alla Nani: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో మృతి
Image Credit: Alla Nani Passes Away

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Alla Nani Passes Away: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ మాజీ నాయకుడు ఆళ్ల నాని (56) హఠాన్మరణం పొందారు. గుండెపోటుతో ఆయన మరణించారు. కొన్ని దశాబ్దాల పాటు ఏపీ రాజకీయాల్లో కొనసాగిన ఆయన మరణంతో తీవ్ర విషాదం ఏర్పడింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కొంత కాలానికే ఆయన మరణించారు. అతడి మృతికి పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆళ్ల నాని మృతికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

30 డిసెంబర్‌ 1969లో జన్మించిన ఆళ్ల నాని పూర్తి పేరు కాళీ కృష్ణ శ్రీనివాస్. కాపు సామాజిక‌వ‌ర్గంలో మంచి గుర్తింపు పొందిన నాని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో కీలక పదవులు పొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆళ్ల నాని ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

పదవులు
ఏలూరు ఎమ్మెల్యేగా ఆళ్ల నాని మూడుసార్లు పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో చేరిన ఆళ్ల నాని

రాజకీయ జీవితం
కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆళ్ల నాని 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు శాసనసభ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నుంచి మళ్లీ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగారావుపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తరువాత 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి పీఆర్పీ అభ్యర్థి కోట రామారావుపై 13,682 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

వైఎస్సార్ మరణంతో
అయితే నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణంతో జరిగిన పరిణామాల అనంతరం 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వెంట నడిచారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కోటా రామారావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్యేగా ఓడినా వైఎస్‌ జగన్ 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆళ్ల నాని పదవీ పొందారు.

మరణించే వరకు
2023 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆళ్ల నాని రాజకీయపరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన ఆయన తర్వాత టీడీపీలో చేరారు. మరణించే వరకు ఆ పార్టీలోనే కొనసాగారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh