Former mp Vijayasai reddy announced launch of his new party: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీ మధ్య తగ్గా ఫార్ వార్ నడుస్తొంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దసరా పండగ వేళ కొత్త పార్టీపై ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
వచ్చేనెలలో తమ కొత్తపార్టీ ప్రకటన ఉంటుందని మాజీ ఎంపీ విజయరెడ్డి పేర్కొన్నారు. నవంబర్ నెల 11వ తేదీ, 11 గంటల 11 నిమిషాలకు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో కొత్త పార్టీకి మూహుర్తం ఫిక్స్ చేసినట్లు చెప్పారు. ఏపీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కోరుకునే వారు తమకు మద్దతివ్వాలని కోరారు.
నవంబర్ 11న పార్టీ జెండా, అజెండాలను ప్రకటిస్తామని ట్విట్ చేశారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి 11 సంఖ్యను ఎంచుకొవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రస్తుతం రెండు పార్టీల కులపిచ్చి, మతపిచ్చి, కుటుంబ పాలన, ఫ్యాక్షన్ రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, రప్పా.. రప్పా వంటి వాటికి చరమగీతం పాడాలని కోరుకుంటున్న వారంతా తమకు మద్దతు పలకాలని విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా అభ్యర్థించారు.
కరువు కాటకాలు కరెంటు కోతలు లేని ఏపీ, ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్, చదువుల భారంలేకుండా యువతకు జాబ్ లు, 100 శాంత ఉద్యోగం,ఉపాధి, పేద, మధ్య తరగతి వారిని ఆదుకునేలా 80 ఏళ్లుగా నెరవేరని ఏపీ ప్రజల ఆకాంక్షలను, జెన్ జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా నవంబర్ నెల 11 తేదీన విజయవాడలో మన పార్టీ ఆవిర్భావం జరుగుతుందని దసరా పండగ వేళ విజయసాయి రెడ్డి ఎక్స్ లో సంచలనట్విట్ చేశారు. దీనిపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.