• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Tirumala: భక్తులతో కిక్కిరిసిపోయిన తిరుమల.. సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలు.. అసలు కారణం ఏమిటంటే..?..

Tirumala: భక్తులతో కిక్కిరిసిపోయిన తిరుమల.. సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలు.. అసలు కారణం ఏమిటంటే..?..

Huge crowd in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్టమైన చర్యలు చేపట్టింది.

Written ByInamdar Paresh
Published: Sep 30, 2026, 11:56 AM IST|Updated: Sep 30, 2026, 12:03 PM IST
joinshare
Tirumala:  భక్తులతో కిక్కిరిసిపోయిన తిరుమల.. సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలు.. అసలు కారణం ఏమిటంటే..?..
Image Credit: tirumala(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Huge devotees crowd in Tirumala temple: తిరుమలలో ప్రస్తుతం భక్తులు రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా వీకెండ్ లు, వరుసగా సెలవుల నేపథ్యంలో రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ లు భక్తులతో నిండిపోయి, శిలాతోరణం వరకు క్యూలు కట్టారు. మరోవైపు  టీటీడీ ఇటీవల పెరిగిపోయిన రద్దీ నేపథ్యంలో 1 , 5 తేదీల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేసింది. 

సామాన్య భక్తులకు ఎక్కువగా దర్శనాలు అయ్యేలా టీటీడీ ఈ విధంగా చర్యలు తీసుకుంది. తిరుమలలో ఎక్కడ చూసిన గోవింద నామస్మరణలతో భక్తులు గంటల కొద్ది క్యూలైన్ లలో వేచి ఉంటున్నారు. టీటీడీ సైతం.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. శ్రీవారి సేవకులతో నిరంతరం తాగునీరు, అన్నప్రసాదంలను నిరంతరం అందిస్తుంది.  ఇకమంగళవారం ఒక్కరోజే 77,082 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 34,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

 భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ దృష్ట్యా అందరూ సంయమనం పాటించి, టీటీడీ సిబ్బందికి సహకరించాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు.

అదే విధంగా చిన్నారులు, వృద్ధులతో తిరుమల దర్శనాలకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరింది.  అదే విధంగా దర్శనాలు, వసతులపేరిట సదుపాయం కల్పిస్తామని.. గుర్తుతెలియని దళారులు, కొత్తవాళ్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ అలర్ట్ జారీ చేసింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
TTD News
Tirupathi