SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత.. GSLV F-18 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌..

ISRO Another Successful Rocket Launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు నిప్పులు చిమ్ముతూ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 31, 2026, 08:21 AM IST | Updated: Oct 31, 2026, 10:50 AM IST
Image Credit: Isro Big Operation (X Pics Isro/Source)
Join

GSLV 5 18 Successful: లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన  20 నిమిషాల తర్వాత ఎన్‌వీఎస్‌-03 నేవిగేషన్‌ ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి చేర్చినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.భారత్‌ సొంత నేవిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగ ప్రధాన ఉద్దేశం. సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహంలో స్వదేశీ, విదేశీ పరిజ్ఞానాలతో రూపొందించిన అణు గడియారాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎల్‌5, ఎస్‌ బ్యాండ్లతో పాటు ఎల్‌1 సంకేతాన్ని అందించనున్నారు.

నావిక్‌ సేవలను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం: ఇస్రో..
దీంతో నేవిగేషన్‌ సేవల సామర్థ్యం మరింత పెరగనుంది. నావిక్‌ వ్యవస్థ ద్వారా భారత భూ భాగంతోపాటు సరిహద్దుల వెలుపల సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో అత్యంత కచ్చితమైన సమాచార సేవలు మనకు అందనున్నాయి.రవాణా, విమానయానం, సముద్ర ప్రయాణాలు, వాహనాల పర్యవేక్షణ, అత్యవసర సేవలు తదితర రంగాల్లో ఈ వ్యవస్థ కీలకంగా ఉపయోగపడనుంది.

 

జీఎస్‌ఎల్‌వీలో 20వ ప్రయోగం.. 
జీఎస్‌ఎల్‌వీ వాహక నౌకకు ఇది 20వ ప్రయోగం. స్వదేశీ క్రయోజనిక్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చడంలో ఇస్రో తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇక అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ ప్రయోగాలు, స్వదేశీ సాంకేతిక అభివృద్ధిలో భారత సాధిస్తున్న పురోగతికి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 ప్రయోగం మరో ఉదాహరణగా నిలిచిందని ఇస్రో ఛైర్మన్‌ డా.వి నారాయణన్‌ తెలిపారు.
 

 ఇస్రో ప్రయోగం సక్సెస కావడం పల్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలు శుభాకాంక్షులు తెలియజేశారు.  

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES