SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Garapati Divya: మరణం తర్వాత వెలువడిన ఫలితాలు.. ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి దివ్య..

Ap Mptc and zptc Elections: పరిషన్ జెట్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి మెజారిటీ స్థానాల్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో నిన్న గారపాటి దివ్య గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

Written By Inamdar Paresh
Published: Nov 07, 2026, 02:49 PM IST | Updated: Nov 07, 2026, 02:57 PM IST
Image Credit: garapati divya (file)
Join

Janasena Candidate garapati divya wins in mptc elections: ఆంధ్ర ప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల ఫలితాల హీట్ కొనసాగుతుంది. ఈ క్రమంలో  కూటమి  భారీ స్థానాల్ని ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పరిషన్ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ లో తూర్పుగోదావరి జిల్లాలోని ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున గారపాటి దివ్య పోటీ చేశారు. అయతే నిన్న గుండెపోటుతో దివ్య కుప్పకూలీపోయారు. 

ఆస్పత్రికి తరలించే లోపు ఆమె మరణించారని వైద్యులు ప్రకటించారు. మరోవైపు పరిషత్ ఎన్నికల్లో  నిన్న మరణించిన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, ధుమంతుని గూడెం ఎంపీటీసీ స్థానం  బరిలో నిలిచిన దివ్య నిన్న కన్నుమూశారు. తన ప్రత్యర్థిపై దివ్య 352 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దివ్య తనను గెలిపించాలని ఎంతో ప్రచారం నిర్వహించారు. ప్రజలకు తానున్నానని భరోసా ఇచ్చారు.

 గెలిస్తే తన ప్రజలకు ఏవిధంగా మంచి చేస్తానో కూడా క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలో తమ ఎంపీటీసీ అభ్యర్థిమరణం తర్వాత గెలవడంపై ప్రజలు సైతం తీవ్ర భావొద్వేగంకు గురౌతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది. గారపాటి దివ్యకు ఇద్దరు సంతానం.  ఒకవైప తమ అభ్యర్థి విజయం మరోవైపు ఆమె లేరనే విషాదంతో ధుమంతుని గూడెంలో గ్రామప్రజలు ఎమోషనల్ అవుతున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES