• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Janasena Municipal Election: ఆంధ్రప్రదేశ్ పురపోరులో జనసేన పార్టీ చారిత్రాత్మక విజయం..100% స్ట్రైక్ రేట్‌తో మరో సరికొత్త రికార్డు!

Janasena Municipal Election: ఆంధ్రప్రదేశ్ పురపోరులో జనసేన పార్టీ చారిత్రాత్మక విజయం..100% స్ట్రైక్ రేట్‌తో మరో సరికొత్త రికార్డు!

Janasena Municipal Election Strike Rate: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల (పురపాలక) ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2024 సాధారణ ఎన్నికల విజయాలను పునరావృతం చేస్తూ, కూటమి పొత్తులో భాగస్వామ్యంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్‌ను సొంతం చేసుకుంది. విజయవాడ, ఏలూరు కార్పొరేషన్లతో పాటు 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలను కైవసం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా తన రాజకీయ బలాన్ని నిరూపించుకుంటోంది.

Written ByHarish Darla
Published: Nov 04, 2026, 08:43 AM IST|Updated: Nov 04, 2026, 08:46 AM IST
joinshare
Janasena Municipal Election: ఆంధ్రప్రదేశ్ పురపోరులో జనసేన పార్టీ చారిత్రాత్మక విజయం..100% స్ట్రైక్ రేట్‌తో మరో సరికొత్త రికార్డు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆమె వల్ల మారాడు.. లేకపోతే బెదిరించేది: రాజమౌళి

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆమె వల్ల మారాడు.. లేకపోతే బెదిరించేది: రాజమౌళి

2

ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. నేడు OUలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ భారీ ర్యాలీ..!!

3

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం భరోసా: రూ.10 లక్షల ఆర్థిక పరిహారం ప్రకటన!

4

Janasena Municipal Election: ఆంధ్రప్రదేశ్ పురపోరులో జనసేన పార్టీ చారిత్రాత్మక విజయం..100% స్ట్రైక్ రేట్‌తో మరో సరికొత్త రికార్డు!

5

Russia Ukraine Strike: స్కూల్‌పై బాంబులతో దాడి..పాఠశాల భవనం నేలమట్టం..29 మంది దుర్మరణం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Janasena Municipal Election Strike Rate: ఆంధ్రప్రదేశ్ పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ జైత్రయాత్రను విజయవంతంగా కొనసాగించింది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన 100 శాతం విజయవంతమైన ట్రాక్ రికార్డును తిరగరాస్తూ, ఈ పురపోరులోనూ ఆ పార్టీ సంచలన ఫలితాలను రాబట్టింది.

ఎన్డీఏ కూటమి పొత్తు ఒప్పందంలో భాగంగా జనసేన పార్టీకి మొత్తం 4 కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల స్థానాలు దక్కాయి. వీటిలో ఇప్పటివరకు పోలింగ్, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 2 కార్పొరేషన్లు (విజయవాడ, ఏలూరు), 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీ స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు ఘనవిజయం సాధించి నూటికి నూరు శాతం ఫలితాలను రాబట్టడం విశేషం.

విజయవాడ మేయర్ పీఠం కైవసం..
ఈ స్థానిక ఎన్నికలను పార్టీ విస్తరణకు జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. పార్టీకి నియోజకవర్గ స్థాయిలో నేరుగా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేని కీలకమైన విజయవాడ నగరంలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ప్రధాన మైలురాయిగా నిలిచింది. విజయవాడలో వంగవీటి రాధాను బరిలో నిలిపి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఏలూరుతో పాటు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో పోటీ చేసి తన రాజకీయ పునాదులను విస్తరించుకుంది.

100% Strike rate Again ! 3/3 Nagar Panchayat chairmans ✅ 2/2 Mayors ✅ 15/15 Municipal Chairmans ✅ #JanaSenaStrikesAgain https://t.co/17AoedLLUU

— JanaSena Party (@JanaSenaParty) November 3, 2026

పార్టీకి సొంత ఎమ్మెల్యేలు ఉన్న తెనాలి, పిఠాపురం, పాలకొండ, భీమవరం, నరసాపురం నియోజకవర్గాలతో పాటు తుని, సామర్లకోట, దర్శి, తిరువూరు, చిలకలూరిపేట, ముమ్మిడివరం, అమలాపురం, పెడన, మడకశిర, పుట్టపర్తి, పుత్తూరు మున్సిపాలిటీల్లోనూ విజయం సాధించి కొత్త ప్రాంతాలకు శ్రేణులను విస్తరించింది. తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొత్త నాయకులకు అవకాశాలు కల్పించడం ఈ 100 శాతం విజయానికి ఎంతగానో దోహదపడింది.

పిఠాపురంలో సంపూర్ణ ఆధిపత్యం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీలో కూటమి భాగస్వాములు సంపూర్ణ మెజార్టీని సొంతం చేసుకున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలోని మొత్తం 36 వార్డుల్లో 3 స్థానాలు ఇప్పటికే జనసేన పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 33 వార్డుల పోలింగ్ ఫలితాలలో జనసేన 16 వార్డులు, తెలుగుదేశం 5, భారతీయ జనతా పార్టీ 1, వైఎస్సార్ సీపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి.

మిగిలిన 10 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు (వారిలో 8 మంది కూటమి రెబల్స్, 2 మంది వైకాపా రెబల్స్) విజయం సాధించారు. పిఠాపురం జనసేన ఛైర్మన్ అభ్యర్థి దానం లాజార్‌బాబు తన సమీప ప్రత్యర్థి పెదపాటి రాజేష్‌కుమార్‌పై 9,235 ఓట్ల భారీ మెజారీటీతో విజయం సాధించి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ నాయకులు, జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Elections
AP News
Pawan Kalyan
Andhra Pradesh