Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.!.
Leopard spotted in Tirumala: వేకువజామున 2 గంటల ప్రాంతంలో చిరుత అలిపిరి మెట్ల మార్గంలో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. ఆ సయమంలో భక్తులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులకు పలు సూచనలు చేసింది.
Leopard spotted at alipiri steps in Tirumala: కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారం తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో తిరుమలలో ఇటీవల వరుస సెలవులు, పండగల నేపథ్యంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అన్ని కంపార్ట్ మెంట్లన్ని భక్తులతో కిట కిటలాడు తున్నాయి. అయితే.. గత రెండు రోజుల పాటు భక్తుల రద్దీతో పోలిస్తే తిరుమలలో ఒకింత రద్దీ తగ్గినట్లు టీటీడీ పేర్కొంది. అయితే భక్తులు ప్రస్తుతం 21 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్నారు. ఇక రూ. 300 ల టోకెన్ లు ఉన్న వారికి మూడు నుంచి నాలుగు గంటల్లో దర్శనం అవుతుంది. అయితే.. తిరుమలలో ఇటీవల తరచుగా చిరుత సంచారంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అలిపిరి నడక మార్గంలోని మోకాలిమిట్ట ప్రాంతంలో మెట్లు ప్రాంతంలో వేకువజామున 2 గంటల ప్రాంతంలో చిరుత సంచరించినట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. అయితే.. భక్తులు అప్పటికి మెట్ల మార్గంలో రాకపోకలు లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు.
ముఖ్యంగా వరసగా కొన్ని రోజుల నుంచి చిరుత మెట్ల మార్గం వద్ద కన్పిస్తుండటంతో భక్తులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అలిపిరి మార్గంలో వెళ్తున్న భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ పలు సూచనలు చేసింది.
నిన్న శ్రీవారిని 90,292 మంది యాత్రికులు దర్శించుకున్నారు. అదే విధంగా.. 27,329 మంది భక్తులు నిన్న శ్రీవారికి తల నీలాలు సమర్పించారు. శ్రీవారికి 4.61 కోట్లు హుండీతో ఆదాయం సమకూరింది. ఇక సర్వదర్శనం కోసం సుమారుగా దర్శన సమయం SSD టోకెన్లు లేకుండా 8-10 గంటల సమయం పడుతుంది.