• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Municipal Elections: ఓటరు చిటీ ఉందా..?.. కేజీ చికెన్ ఫ్రీ.. ఏపీలో లోకల్ దంగల్ వేళ బంపర్ ఆఫర్..

AP Municipal Elections: ఓటరు చిటీ ఉందా..?.. కేజీ చికెన్ ఫ్రీ.. ఏపీలో లోకల్ దంగల్ వేళ బంపర్ ఆఫర్..

Ap municipal Election: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కడల పులివెందులలో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.

Written ByInamdar Paresh
Published: Nov 01, 2026, 08:33 AM IST|Updated: Nov 01, 2026, 08:46 AM IST
joinshare
AP Municipal Elections: ఓటరు చిటీ ఉందా..?.. కేజీ చికెన్ ఫ్రీ.. ఏపీలో లోకల్ దంగల్ వేళ బంపర్ ఆఫర్..
Image Credit: ap municipal elections row

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
పండగ ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర..!!

పండగ ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర..!!

2

Balakrishna: పనిచేసే వారికి ఓటెయ్యాలి.. హిందూపురంలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..

3

సన్నబియ్యం ధరలకు కళ్లెం.. గరిష్ఠ ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!

4

Yadadri: చౌటుప్పల్ లో జోగిని దారుణ హత్య.. 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు దోపిడి..

5

AP Municipal Elections: ఓటరు చిటీ ఉందా..?.. కేజీ చికెన్ ఫ్రీ.. ఏపీలో లోకల్ దంగల్ వేళ బంపర్ ఆఫర్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cash and meat offer in ap municipal election polling: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ ఎన్నికలను కూటమితో పాటు వైసీపీ సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీలో 13 నగర పాలక సంస్థలు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయాతీల్లో తొలిదశ పొలింగ్  ప్రారంభమైంది. అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకొవడానికి పలు చోట్ల వివిధ పార్టీలకు చెందిన నేతలు ప్రలోభాల పర్వంకు కూడా తెరతీశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట ఉన్న వారికి వెయ్యి నుంచి 5 వేల వరకు ఇస్తున్నారు. అంతే కాకుండా కేజీ చికెన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు.

నెల్లూరులో ఓటర్లకు చీరలు, నగదు, నిత్యవసారాల సరుకులు అంజేస్తున్నారు. స్థానికంగా వెంకటేవ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీలో చికెన్ ను ఫ్రీగా ఇస్తుండటంతో దుకాణాలు కిక్కిరిసిపోయాయి. దీంతో పోలీసులు ఈ విషయం తెలిసి చికెన్ షాపుల్ని మూసివేయించారు. ఇదే విధంగా ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న ఆయా నియోజక వర్గాల్లో డబ్బులు,  మద్యం, బిర్యానీ, కుక్కర్లు,  పలుసామాగ్రిని ఓటర్లకు పంపిణి చేస్తున్నారు.

కార్పొరేటర్‌ అభ్యర్థుల నుంచి మేయర్‌ అభ్యర్థుల వరకు కూడా ఇదే విధంగా పంపిణిలు చేస్తున్నారు. అదే విధంగా  కౌన్సిలర్‌ నుంచి చైర్‌పర్సన్‌ దాకా అభ్యర్థులు కొంత మంది ప్రలోభాలకు తెరతీయడంతో  స్థానిక సమరం కాస్త హీటెక్కిపోయింది. కూటమి వర్సెస్ వైసీపీ నేతలు పలు చోట్ల  ప్రలోభాలకు తెరతీశారంటూ పరస్పరం పోలీసులకు ఫిర్యదులు చేసుకున్నారు. మరోవైపు పోలీసులు ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరక్కుండా తనిఖీలు చేపట్టారు. చీమకుర్తి, నరసాపురం, కర్నూల్, నెల్లూరులో ఈ విధంగా ఓటర్లను ప్రసన్నం చేసుకొవడానికి అభ్యర్థులు వివిధ మార్గాల్లో ప్రలోభాలకు తెరతీశారు. మొత్తంగా ఉద్రిక్త పరిస్థితుల మధ్యలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 


ఉదయం. 7 నుంచి సా. 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసారి మేయర్లు ప్రత్యక్ష విధానంలో బరిలోకి దిగారు. ఇప్పటికే 17 మున్సిపల్ చైర్మన్లు, మేజర్ పంచాయతీలలో కూటమి ఏకగ్రీవమయ్యాయి.  టీడీపీకి 15 చైర్‌పర్సన్ స్థానాలు, జనసేన 1, బీజేపీ 1  ఏక గ్రీవమయ్యాయి. 8 చోట్ల చైర్‌పర్సన్ సహా కౌన్సిలర్లు ఏకగ్రీవం, 922 కార్పొరేషన్ డివిజన్లలో 118 ఏకగ్రీవమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల విధులకు 36 వేలకు పైగా సిబ్బందిని ఈసీ రంగంలోకి దింపింది.

పలు జిల్లాల్లో 671 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, మరో 1,233 సున్నిత కేంద్రాల్లో 4,943 మంది సిబ్బంది ప్రత్యేక నిఘాను పెట్టారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. పోలీంగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందో బస్తు చేపట్టారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని  ఎన్నికల సంఘం ప్రజలకు సూచించింది. మరోవైపు నవంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Telugu News