• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /MLA Kolikapudi Controversy: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..టీచర్‌పై దాడి ఆరోపణలు..ఎమ్మెల్యే వివరణ!

MLA Kolikapudi Controversy: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..టీచర్‌పై దాడి ఆరోపణలు..ఎమ్మెల్యే వివరణ!

Kolikapudi Srinivasa Rao Controversy: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక ప్రభుత్వ పీఈటీ టీచర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన ఇంటికి పిలిపించి కర్రతో కొట్టారని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఈ ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆయన ఫిర్యాదు చేశారు.

Written ByHarish Darla
Published: Sep 30, 2026, 01:59 PM IST|Updated: Sep 30, 2026, 02:02 PM IST
joinshare
MLA Kolikapudi Controversy: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..టీచర్‌పై దాడి ఆరోపణలు..ఎమ్మెల్యే వివరణ!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kolikapudi Srinivasa Rao Controversy: ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. విస్సన్నపేట మండలం నరసాపురం జెడ్పీ హైస్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్న మేరుగు రమేష్ అనే ఉపాధ్యాయుడిని ఈ నెల 25న ఎమ్మెల్యే తన ఇంటికి పిలిపించుకున్నారని సమాచారం. అక్కడ రమేష్‌ను దుర్భాషలాడి కర్రతో కొట్టారని ఆరోపిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య లేఖ రాశారు.

రమేష్‌తో పాటు అదే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని కూడా డిప్యూటీ డీఈవో ద్వారా పిలిపించి ఎమ్మెల్యే తిట్టారని, బాధితులిద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారని ఫిర్యాదులో పేర్కొన్నారు

వివాదానికి ప్రధాన కారణం..
నరసాపురం పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలకు ఎమ్మెల్యే కొలికపూడిని కాకుండా, స్థానిక టీడీపీ నేతను ముఖ్య అతిథిగా ఆహ్వానించారనే కోపంతోనే ఎమ్మెల్యే ఈ చర్యకు పాల్పడ్డారని బాలకోటయ్య తన లేఖలో ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రవర్తన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వాదన..
ఈ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పందిస్తూ తాను ఎవరినీ కొట్టలేదని, మందలించలేదని స్పష్టం చేశారు. పీఈటీ రమేష్‌పై అదే స్కూల్‌లో పనిచేసే మరో ఉపాధ్యాయుడిని కొట్టారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా, ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా విద్యార్థినులను ఇతర ప్రాంతాలకు పంపించారని ఆరోపించారు. 

గతేడాది పదో తరగతి ఫలితాల్లో 22 మందికి గాను 11 మంది ఫెయిల్ అవ్వడానికి పీఈటీ తీరే కారణమని విమర్శించారు. పాఠశాలలో జరుగుతున్న అంశాలపై చర్చించేందుకే డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెచ్‌ఎం, పీఈటీ రమేష్‌లను ఇంటికి పిలిచి గట్టిగా అడిగి పంపాన తప్ప ఎవరినీ కొట్టలేదని వివరించారు.

గత వివాదాలు..
కొలికపూడి శ్రీనివాసరావు గతంలో ఎంపీ కేశినేని చిన్నితో విభేదాలు, నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాల్లో వివాదాస్పదమయ్యారు. ఇటీవల మంత్రి గొట్టిపాటి రవికుమార్ తిరువూరు పర్యటనలో ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తాజా వివాదంపై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Chandrababu Naidu
AP News
Telugu News