• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ ఎన్నికలు పూర్తి.. ఏపీలో 'పరిషత్'లపై కూటమి 99% స్ట్రైక్ రేట్.. వైఎస్సార్‌సీపీ 1%

ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ ఎన్నికలు పూర్తి.. ఏపీలో 'పరిషత్'లపై కూటమి 99% స్ట్రైక్ రేట్.. వైఎస్సార్‌సీపీ 1%

NDA Bags 27 Zilla Parishads Out Of 28 ZP Chairmans: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి హవా కొనసాగుతోంది. అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను సొంతం చేసుకున్న కూటమి పార్టీలు అదే స్థాయిలో జిల్లా పరిషత్‌ పీఠాలను కూడా సొంతం చేసుకున్నాయి. 99 శాతం జెడ్పీ పీఠాలు కూటమి ఖాతాలో పడగా.. వైఎస్సార్‌సీపీ ఒక పీఠాన్ని సొంతం చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 20, 2026, 21:51 IST|Updated: Nov 20, 2026, 21:55 IST
joinshare
ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ ఎన్నికలు పూర్తి.. ఏపీలో 'పరిషత్'లపై కూటమి 99% స్ట్రైక్ రేట్.. వైఎస్సార్‌సీపీ 1%
Image Credit: Zilla Parishad Elections

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Zilla Parishad Elections: మున్సిపల్‌ ఎన్నికల్లో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసిన కూటమి జిల్లా పరిషత్‌ సభ్యుల ఎన్నికల్లోనూ అదే ఫలితాలను పొందింది. దాదాపుగా అన్నీ స్థానాలను దక్కించుకున్న కూటమి పార్టీలు.. ఇప్పుడు రాష్ట్రంలోని ఒక్క జిల్లా పరిషత్‌ పీఠం తప్ప మిగిలినవన్నీ కూటమిపరమయ్యాయి. రాష్ట్రంలో ఉన్న 28 జిల్లా ప్రజా పరిషత్‌ స్థానాల్లో 27 స్థానాలను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కైవసం చేసుకున్నాయి. జెడ్పీ పీఠాలను 99% స్ట్రైక్‌ రేటు సాధించగా.. ఒక్క స్థానాన్ని దక్కించుకున్న వైఎస్సార్‌సీపీకి ఒక శాతానికి పరిమితమైంది.

మొత్తం 28 జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ) స్థానాలకు శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) దాదాపుగా మొత్తం స్థానాలను సొంతం చేసుకుంది. 28 జెడ్పీ పీఠాల్లో కూటమి 27 స్థానాలను కైవసం చేసుకోగా.. వైఎస్సార్‌సీపీ కేవలం ఒక్క స్థానం దక్కించుకుంది. ఈ ఫలితాలతో కూటమి ఆధిపత్యం ప్రదర్శించగా.. వైఎస్సార్‌సీపీ కుదేలైంది.

క్షేత్రస్థాయిలో జరిగిన ఎన్నికల్లోనూ కూటమి హవా కొనసాగించడం విశేషం. మొత్తం 28 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 22 జెడ్పీ చైర్మన్ పదవులు పొందగా.. 20 వైస్ చైర్మన్‌ పదవులను దక్కించుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ ఆధిపత్యం కొనసాగించగా.. వైఎస్సార్‌సీపీ బలంగా ఉండే విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కడప, కర్నూలు వంటి కీలక జిల్లా పరిషత్‌ స్థానాలను సొంతం చేసుకుని తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. 

జనసేన పార్టీకి నాలుగు జెడ్పీ చైర్మన్‌ పదవులు దక్కాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్‌పై జనసేన జెండా ఎగురగా.. 5 వైస్ చైర్‌పర్సన్ స్థానాలు దక్కాయి. బీజేపీకి కృష్ణా జిల్లా చైర్మన్‌ పదవి ఒక్కటే దక్కగా.. ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల వైస్ చైర్‌పర్సన్ పదవులు పొందింది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌తోపాటు వైస్ చైర్‌పర్సన్ పదవులు రెండింటిని దక్కించుకుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
TDP
YCP
Elections
Telugu News
AP News