• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /ఏపీకి మరో వర్ష గండం.. 15వ తేదీన తీవ్ర వాయుగుండం? ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!

ఏపీకి మరో వర్ష గండం.. 15వ తేదీన తీవ్ర వాయుగుండం? ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!

ఏపీలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 15 నాటికి ఇది వాయుగుండంగా బలపడి మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండం కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Written ByRenuka Godugu
Published: Oct 03, 2026, 08:41 AM IST|Updated: Oct 03, 2026, 08:45 AM IST
joinshare
ఏపీకి మరో వర్ష గండం.. 15వ తేదీన తీవ్ర వాయుగుండం? ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!
Image Credit: AP Weather Update

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
విశాఖ బీచ్‌లో విషాదం.. రుషికొండలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు! దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబుకు తండ్రి గుండెకోత మెసేజ్!

విశాఖ బీచ్‌లో విషాదం.. రుషికొండలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు! దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబుకు తండ్రి గుండెకోత మెసేజ్!

2

కుజుడు, గురుడి మహాసంయోగం.. అక్టోబర్ 31 వరకు ఈ 3 రాశులకు డబుల్ జాక్‌పాట్!

3

ఏపీకి మరో వర్ష గండం.. 15వ తేదీన తీవ్ర వాయుగుండం? ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!

4

పీఎం కిసాన్ రూ.2000 మీ ఖాతాలో పడలేదా? ఇలా ఫిర్యాదు చేస్తే వెంటనే డబ్బులు మీ అకౌంట్‌లోకి!

5

Auto Charges Hike: ఆటో ఛార్జీల పెంపుపై కార్మికుల ఆగ్రహం.. 3 రోజుల నిరసనలు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ఇవాళ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వీటితో పాటు కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈ నెల 15 నాటికి ఆవర్తనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున, ఏపీలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ, మరి కొద్ది రోజుల్లో అంటే ఈ నెల 15వ తేదీ నాటికి వాయుగుండం ఏర్పడే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసేందుకు అధిక అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి.

10 రోజుల క్రితం ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు వంటి ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  కొద్ది రోజులుగా కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం వారికి ఉపశమనాన్ని కలిగించేలా ఉంది.

దక్షిణ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండం కనిపిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇది 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారితే రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంతోపాటు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఋతుపవన తిరోగమనం కారణంగా రాష్ట్రంలో దట్టమైన వర్షపాతం నమోదవుతోంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి.

Read Also: వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..
 

వారం రోజులుగా పడిన భారీ వర్షాల వల్ల అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. గతంలో వాయుగుండం తీరం దాటినప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార వంటి నదులతో పాటు కృష్ణా, గోదావరి నదులు కూడా ఎగువ ప్రాంతాల్లో భారీగా ఉధృతంగా ప్రవహించాయి. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 15వ తేదీ నాటికి వాయుగుండం ఏర్పడే క్రమంలో, ఈరోజు కూడా అల్లూరి సీతారామరాజు ,పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather