Kurnool: దేవరగట్టు బన్నీఉత్సవంలో విషాదం.. ఒకరి దుర్మరణం.. వందల మందికి తీవ్ర గాయాలు.. వీడియో..
Banni Utsavam Violence in Kurnool: మాళ మల్లేశ్వరస్వామి స్వామివారి విగ్రహాలను దక్కించుకునేందుకు 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. దేవర గట్టు బన్నీ ఉత్సవంలో ఒకరు స్పాట్లోనే చనిపోగా, వందల మంది తలలు పగిలి తీవ్ర గాయాల పాలయ్యారు.
One dead and Several injured in Devaragattu banni festival: ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ప్రతి ఏటా బన్నీ ఉత్సవం జరుగుతుంది. దసరా తర్వాత దేవరగట్టులో ఈ ఉత్సవంను నిర్వహిస్తారు. నిన్న నిర్వహించిన బన్నీ ఉత్సవంలో మాళ మల్లేశ్వరస్వామి విగ్రహంను దక్కించుకునేందుకు 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారు. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా వందల మంది తలలు పగిలి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికంగా.. హోళగుంద మండలం దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం తర్వాత ఉత్సవ మూర్తుల్ని కొండపైకి తీసుకెళ్తుంటారు.
ఈ ఆచారంలో భాగంగా నిన్న నిర్వహించిన ఉత్సవంలో కూడా.. రెండు వర్గాలు స్వామి వారి విగ్రహాల్ని తమ గ్రామంలోకి తీసుకెళ్లేందుకు కర్రలతో పోటీ పడ్డారు. ఈక్రమంలో పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. తీవ్ర రక్తస్రావమైన కూడా అక్కడ ఎవరు వెనుకాడలేదు. గంటల కొద్ది పరస్పరం తలల మీద దాడులు చేసుకున్నారు. రక్తాలు కారుతున్న కూడా ఎవరు తగ్గలేదు.
కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ ఆచారంను పాటిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈక్రమంలో తాజాగా.. నిర్వహించిన బన్నీ ఉత్సవంలో ఆలూరుకు చెందిన పోతురాజు అనే వ్యక్తి తలపగిలి తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు. మరోవైపు వందల మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు.
గాయపడిన వారికి సైతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఉత్సవంకు తిలకించేందుకు ఏపీ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు భారీగా తరలివచ్చి వచ్చి మాళమ్మ, మల్లేశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. బన్నీ ఉత్సవంను కర్రల సమరంను ఆసక్తిగా తిలకించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం హింసకు తావులేకుండా పోలీసులు, అధికారులు పకట్బంది చర్యలు తీసుకున్న కూడా రక్తపాతంను మాత్రం ఆపలేక పోయారు.