• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Tamannaah Bhatia: OTTలోకి తమన్నా బ్లాక్ బస్టర్ మిస్టరీ థ్రిల్లర్... కానీ ఓ ట్విస్ట్!

Tamannaah Bhatia: OTTలోకి తమన్నా బ్లాక్ బస్టర్ మిస్టరీ థ్రిల్లర్... కానీ ఓ ట్విస్ట్!

Tamannaah Bhatia: తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘ది వ్వాన్: ది ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Written ByVishnu Priya
Published: Oct 22, 2026, 01:06 PM IST|Updated: Oct 22, 2026, 01:12 PM IST
joinshare
Tamannaah Bhatia: OTTలోకి తమన్నా బ్లాక్ బస్టర్ మిస్టరీ థ్రిల్లర్... కానీ ఓ ట్విస్ట్!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Pawan Kalyan Meets CBN: ప్రొటోకాల్ పక్కనపెట్టి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఆకస్మిక భేటీ..అత్యవసర భేటీ వెనుక కారణం ఏంటి?

Pawan Kalyan Meets CBN: ప్రొటోకాల్ పక్కనపెట్టి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఆకస్మిక భేటీ..అత్యవసర భేటీ వెనుక కారణం ఏంటి?

2

Guru Mangal Yuti 2026: దీపావళి తర్వాత ఈ 3 రాశులకు జాక్‌పాట్.. గురు-మంగళ యుతితో డబ్బే డబ్బు!

3

Tamannaah Bhatia: OTTలోకి తమన్నా బ్లాక్ బస్టర్ మిస్టరీ థ్రిల్లర్... కానీ ఓ ట్విస్ట్!

4

జీర్ణ సమస్యలు.. మలబద్ధకంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారా? ఈ 3 పదార్థాలు మీ డైట్‌లో చేర్చితే చాలు!

5

Kurnool: దేవరగట్టు బన్నీఉత్సవంలో విషాదం.. ఒకరి దుర్మరణం.. వందల మందికి తీవ్ర గాయాలు.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tamannaah Bhatia: సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాల్లో తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన హిందీ మూవీ ‘ది వ్వాన్: ది ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ కూడా ఒకటి. జానపద కథ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మూవీ డిజిటల్ రిలీజ్ విషయంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది.

నవంబర్ 6 నుంచి ఓటీటీలోకి!

తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 6, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

అయితే ఈ సినిమా చూడాలనుకునే వారికి ఒక విషయం తెలుసుకోవాలి. ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉన్నంత మాత్రాన ఈ సినిమాను ఉచితంగా చూడలేరు. మొదట రెంటల్ విధానంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అంటే సినిమా చూడాలంటే సభ్యత్వంతో పాటు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

‘ది వ్వాన్’ సినిమా అడవి నేపథ్యంలో సాగుతుంది. పాత జానపద కథను ఆధునిక మిస్టరీ, సస్పెన్స్ అంశాలతో కలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు. అడవిలో జరిగే రహస్య సంఘటనలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. సాధారణ కథలకు భిన్నంగా మిస్టరీ, జానపద అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.ఈ చిత్రంలో తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు శ్వేతా తివారీ, సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, అనూప్ సోని తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఓటీటీలో చూసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం ఆసక్తిని కలిగించవచ్చు. అయితే నవంబర్ 6న రెంటల్ విధానంలో అందుబాటులోకి వస్తుందనే సమాచారాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సాధారణ ప్రైమ్ సభ్యత్వంలో ఈ సినిమా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Read More: బాక్సాఫీస్ దగ్గర ‘రణబాలి’ దూకుడు.. త్వరలో లాభాల్లోకి..!

Read More:Zee Entertainment: బుల్లితెర, ఓటీటీ వీక్షకులకు పండగే.. సరికొత్త షోలతో రాబోతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్..!

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
Tollywood
Telugu News