• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /సీఎంకు ఉద్యోగుల అల్టిమేటం.. రెండు రోజుల సామూహిక సెలవులతో రాష్ట్రం అతలాకుతలం..!!

సీఎంకు ఉద్యోగుల అల్టిమేటం.. రెండు రోజుల సామూహిక సెలవులతో రాష్ట్రం అతలాకుతలం..!!

Government Employees Strike: లాంగ్ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించడంలో పంజాబ్ సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రెండు రోజులపాటు సామూహిక సాధారణ సెలవులు పెట్టారు. అక్టోబర్ 21, 22వ తేదీల్లో జరిగే ఈ నిరసనలతో జేఏసీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అందరూ విధులకు దూరంగా ఉండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

Written ByBhoomi
Published: Oct 22, 2026, 10:49 AM IST|Updated: Oct 22, 2026, 10:51 AM IST
joinshare
సీఎంకు ఉద్యోగుల అల్టిమేటం.. రెండు రోజుల సామూహిక సెలవులతో  రాష్ట్రం అతలాకుతలం..!!
Image Credit: Government Employees Strike:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అక్టోబర్ 27 నుంచి కీలక భేటీ.. దీపావళి వేళ పసిడి ప్రియులకు పండగే పండుగ..!!

అక్టోబర్ 27 నుంచి కీలక భేటీ.. దీపావళి వేళ పసిడి ప్రియులకు పండగే పండుగ..!!

2

Pawan kalyan: డిప్యూటీ సీఎం పేరుతో వాట్సాప్ ఛానెల్.. పవన్ కళ్యాన్ సీరియస్.. కీలక ఆదేశాలు..

3

ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు..

4

సీఎంకు ఉద్యోగుల అల్టిమేటం.. రెండు రోజుల సామూహిక సెలవులతో రాష్ట్రం అతలాకుతలం..!!

5

ముగిసిన దసరా సెలవులు..నగరం బాట పట్టిన జనం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Government Employees Strike: లాంగ్ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించడంలో పంజాబ్ సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రెండు రోజులపాటు సామూహిక సాధారణ సెలవులు పెట్టారు. అక్టోబర్ 21, 22వ తేదీల్లో  జరిగే ఈ నిరసనలతో జేఏసీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అందరూ విధులకు దూరంగా ఉండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రభుత్వం నుంచి ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ప్రధాన డిమాండ్లను సాధించుకునే లక్ష్యంతో పంజాబ్‌లో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా విధులను బహిష్కరించడంతో, బుధవారం ప్రభుత్వ కార్యాలయాలన్నీ బోసిపోయి సేవలు సంపూర్ణంగా  నిలిచిపోయాయి. ఈ సమ్మెకు పలు ప్రముఖ రవాణా సంఘాలు సైతం సంఘీభావం తెలపడంతో సాధారణ ప్రజానీకానికి రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

రాష్ట్ర రాజధాని చండీగఢ్‌లోని పంజాబ్ సివిల్ సెక్రటేరియట్, మొహాలీలోని పీయూడీఏ భవన్‌తో పాటు ప్రతి జిల్లా కేంద్రంలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల ఎదుట వేల సంఖ్యలో ఉద్యోగులు గుమిగూడి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కావాల్సిందిగా అధికార వర్గాల నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ, ఉద్యోగ సంఘాల నేతలు దానిని తిరస్కరించారు. కేవలం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపి, తమ డిమాండ్లపై రాతపూర్వకమైన మరియు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని వారు తేల్చిచెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా దీర్ఘకాలంగా అడుగుతున్న డిమాండ్లలో.. నిలిచిపోయిన 18 శాతం కరవు భత్యం (డీఏ) బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని (OPS) మళ్లీ అమల్లోకి తీసుకురావాలని, అలాగే వివిధ విభాగాల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
DA Hike
Employees
Telugu News
National News