Petrol bomb attack on ys avinash reddy convoy in pulivendula: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతి ఎన్నికల నామినేషన్ వేళ తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇప్పటికే వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంలా రాజకీయాలు మారిపోయాయి. మరోవైపు ఏపీలో నామినేషన్ ల వేళ జరుగుతున్న ఉద్రిక్తలపై ఏపీ హైకోర్టు పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల సంఘంకు కీలక ఆదేశాలు సైతం జారీ చేసింది. దీనిపై ఇప్పటికే వైసీపీ పార్టీ నేతలు తమపై కూటమి నేతలు కావాలని దాడులు చేస్తున్నారని, తమ పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ లు వేయకుండా అడ్డుపడుతున్నారని ఫైర్ అవుతున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి మద్దతుగా ఉంటున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో పులివెందులలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పెట్రోల్ బాంబు దాడి ఘటన తీవ్ర కలకలంగా మారింది.
🚨 నామినేషన్‌కు వెళ్తుండగా.. ఎంపీ అవినాష్ కాన్వాయ్‌పై పెట్రోల్ బాంబులు! 📌 వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. 📌 పార్టీ అభ్యర్థుల నామినేషన్ కోసం వెళ్తుండగా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో ఈ ఘటన జరిగింది. #YSRCP #AvinashReddy
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 20, 2026
కడప జిల్లా పులివెందులలో నామినేషన్ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలోని అంకాలమ్మ గూడూరు వద్ద ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై ప్రత్యర్థులు పెట్రోల్ బాంబు దాడి చేశారు. రెండో దశ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా, తమ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులను ఎంపీ అవినాశ్ రెడ్డి తన వాహనాల్లో నామినేషన్ కేంద్రాలకు తీసుకెళ్తుంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
టీడీపీ నేత బీటెక్ రవి నేతృత్వంలోని వర్గీయులు ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుని రాళ్లు, కర్రలతో దాడిచేసినట్లు సమాచారం. దీంతో వాహనలు పూర్తిగా ధ్వంసమయ్యమాయి. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం నుంచి కార్యకర్తలు తప్పించుకున్నారు.
దీనిపై ఎంపీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశించిన కూడా పోలీసులు సీరియస్ గా తీసుకొవడంలేదని, కేవలం సర్పంచ్ అభ్యర్థులకే పోలీసులు భద్రత ఇస్తూ వార్డు సభ్యులను పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏకంగా ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై పెట్రోల్ బాంబు దాడి జరగడటం కడపులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు భారీగా బలగాల్ని రంగంలోకి దింపారు. శాంతి భద్రతలకు ఆటంకం కల్గకుండా చర్యలు చేపట్టారు.