Police staff performed seemantham for woman constable in manyam : సాధారణంగా పోలీసులు విధి నిర్వహణలో చాలా సీరియస్ గా ఉంటారు. చాలా సందర్బాల్లో పండగలు, శుభాకార్యాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులకు కూడా సరైన విధంగా టైమ్ ఇవ్వలేని సిట్యువేషన్ లో ఉంటారు. ఎక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తిన ముందు పోలీసు వారు అలర్ట్ గా ఉండాలని చెప్తుంటారు. అయితే.. చాలా మంది పోలీసలు కాఠిన్యంగా ఉంటారని భావిస్తారు. బూతులు తిడుతూ పీఎస్ కు వచ్చే వారికి చుక్కలు చూపిస్తారు. కానీ కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. ఆ కాఠిన్యం వెనుక ఎంతో సున్నితమైన మనసు ఉంటుందని ప్రస్తుతం వైరల్ గా మారిన ఘటన స్పష్టంగా తెలియజేస్తుంది. ఏపీలో జరిగిన ఈ ఘటనపై పోలీసుల తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
🤰 పోలీస్ స్టేషన్‌లోనే సీమంతం.. మహిళా కానిస్టేబుల్‌కు సహచరుల ఆత్మీయ వీడ్కోలు 🔹 పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ మంగమ్మకు ఎస్పీ ఇటీవల మెటర్నిటీ లీవ్ మంజూరు చేశారు. 🔹 సెలవుపై వెళ్తున్న ఆమెకు సీఐ బి. వెంకట్రావు ఆధ్వర్యంలో తోటి సిబ్బంది స్టేషన్ ఆవరణలోనే సంప్రదాయబద్ధంగా సీమంతం చేశారు. 🔹 సొంత బిడ్డలా భావించి పసుపు, కుంకుమ, గాజులు, కొత్త బట్టలు పెట్టి, అక్షింతలు వేసి తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించారు. 🔹 పోలీసుల్లోని ఈ ఆత్మీయ కోణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి. #Parvathipuram #APPolice
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 20, 2026
ఆంధ్ర ప్రదేశ్ లోని మన్యం జిల్లా పార్వతిపురం పోలీస్ స్టేషన్ లో మంగమ్మకు పోలీసులు సీమంతం వేడుకను నిర్వహించారు. పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ మంగమ్మకు ఇటీవల ఎస్పీ ఇటీవల మెటర్నిటీ లీవ్ మంజూరు చేశారు. దీంతో సెలవుపై వెళ్తున్న ఆమెకు సీఐ బి. వెంకట్రావు ఆధ్వర్యంలో తోటి సిబ్బంది స్టేషన్ ఆవరణలోనే సంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించారు.
ఉన్నతాధికారులు తమ సొంత బిడ్డలా భావించి పసుపు, కుంకుమ, గాజులు, కొత్త బట్టలు పెట్టి, అక్షింతలు వేసి తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించారు. పీఎస్ లోని స్టాఫ్ సైతం దీనిలో ఉల్లాసంగా పాల్గొని ఆత్మీయ వీడ్కొలు పలికారు. కానిస్టేబుల్ మంగమ్మ సైతం సీమంతం వేడుకపై భావొద్వేగంకు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.