SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఉద్యోగులకు అలర్ట్.. 12వ PRC మార్గదర్శకాలు విడుదల.. డిసెంబర్ 31తో ముగియనున్న డెడ్‌లైన్..!!

PRC Guidelines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ కమిషన్ (12th PRC) ప్రక్రియలో కీలక ముందడుగు పడింది.

Written By Bhoomi
Published: Nov 17, 2026, 10:58 IST | Updated: Nov 17, 2026, 13:17 IST
Image Credit: PRC Guidelines:
Join

PRC Guidelines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ కమిషన్ (12th PRC) ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి కమిషన్ ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలతో కూడిన అధికారిక మార్గదర్శకాలను (Terms of Reference) రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన ఈ విధివిధానాలపై ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాలు తమ విలువైన సూచనలు, సలహాలతో పాటు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం డిసెంబర్ 31వ తేదీ వరకు గడువును నిర్దేశించింది. నిర్దేశిత గడువులోగా ఉద్యోగుల నుంచి అందే అన్ని అభిప్రాయాలను పీఆర్సీ కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. వాటి ఆధారంగా మార్గదర్శకాలలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసిన అనంతరమే కమిషన్ ప్రభుత్వానికి తన తుది నివేదికను సమర్పించనుంది.

యూజీసీ, ఎన్సీటీఈ, బార్ కౌన్సిల్ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల అధ్యాపకులతో పాటు జాతీయ న్యాయవేతన సంఘం పరిధిలోకి వచ్చే న్యాయాధికారులకు ఈ పీఆర్సీ వర్తించనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, యూనివర్సిటీల బోధనేతర సిబ్బంది, శాశ్వత కంటింజెంట్ ఉద్యోగుల జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలపై కమిషన్ ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న డీఏ మూలవేతనంలో ఎంత వరకు విలీనం చేయాలన్న దానిపై అధ్యయనం చూసే నూతన పే స్కేళ్లను కూడా ఖరారు చేయనుంది.

ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను ఇది పరిశీలించి.. దానిని కొనసాగించాలా లేక సవరించాలా అనే దానిపై సిఫార్సులు చేస్తుంది. అదనంగా, ప్రత్యేక వేతనం, ఇతర భత్యాల చెల్లింపు నియమాలను,  పింఛనుదారుల కోసం ఉన్న ప్రస్తుత పింఛను పథకాన్ని కూడా కమిషన్ సమీక్షిస్తుంది. గ్రేడెడ్ వ్యవస్థకు మారడం, కాంట్రాక్ట్,  డిప్యుటేషన్ నియమాలు, కమిషన్ ఆదేశాన్ని పరిగణనలోకి తీసుకుని, శాఖల వారీగా మానవ వనరుల అవసరాలను ఇది నిర్ధారిస్తుంది. ఈ సిఫార్సులను ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: 

చదువే తలరాతను మార్చే ఆయుధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!

మళ్లీ పతనమైన బంగారం ధర.. తులం 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES