• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /చదువే తలరాతను మార్చే ఆయుధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!

చదువే తలరాతను మార్చే ఆయుధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!

World Students Day 2026: విద్యార్థులంటే పాఠశాల లేదా కాలేజీకి వెళ్లి విద్యను అభ్యసించేవారే కాదు.. ప్రతి మనిషి రోజు ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం అనేది సహజం. అందుకే మనమంతా నిత్య విద్యార్థులమే.

Written ByBhoomi
Published: Nov 17, 2026, 10:15 IST|Updated: Nov 17, 2026, 10:18 IST
joinshare
చదువే తలరాతను మార్చే ఆయుధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!
Image Credit: World Students Day 2026

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

World Students Day 2026: విద్యార్థులంటే పాఠశాల లేదా కాలేజీకి వెళ్లి విద్యను అభ్యసించేవారే కాదు.. ప్రతి మనిషి రోజు ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం అనేది సహజం. అందుకే మనమంతా నిత్య విద్యార్థులమే. మనిషి నిజమైన వ్యక్తిగా ఎదిగేందుకు విద్యార్థి దశ ఎంతో కీలకంగా ఉంటుంది. జీవితంలో విద్యార్థి దశ గొప్పతనాన్ని తెలియజేసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నవంబర్ 17వ తేదీన అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. విద్యార్థుల హక్కులను కాపాడటం.. వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరాన్ని చాటి చెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యమని చెప్పాలి.

విద్యార్థి  జీవితం: 
విద్యార్థి దశ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన.. ఉత్తేజకరమైన సమయం. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడం.. అన్వేషించడం ద్వారా జ్నానాన్ని డెవలప్ చేసుకుంటారు. ఆటపాటలతోపాటు కొత్త స్నేహాలతో సాగే ఆ ప్రయాణం ఎప్పటికీ ఒక మంచి జ్నాపకమే అని చెప్పాలి.  సమయ నిర్వహణ, సమస్యా పరిష్కారం, క్రమశిక్షణ, గమ్యాన్ని చేరాలన్న పట్టుదలతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు. జీవిత నైపుణ్యాలను డెవలప్ చేసుకోవచ్చు. విద్యా సంబంధ పరీక్షల్లో మంచి గ్రేడ్ సంపాదించడం, సవాళ్లను ఎదుర్కోవడం మొదలైనవన్నీ విద్యార్థి దశలోనే చేసే కృషి అంకితభావానికి నిదర్శనం.

అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం చారిత్రక నేపథ్యం: 
1933లో అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయిన తర్వాత సామ్రాజ్య విస్తరణలో భాగంగా పొరుగు దేశాలను ఆక్రమించాలని ప్రయత్నించారు. 1938లో నాజీలు మొదట ఆస్ట్రియాను స్వాధీనం చేసుకున్నారు. 1939లో చెకోస్టోవియాను ఆక్రమించాలనే ప్లాన్ చేశారు. అదే ఏడాది నవంబర్ 17న హిట్లర్ సేనలు ప్రాక్ లోని చార్లెస్ యూనివర్సిటీలోకి ప్రవేశిస్తుండగా.. అందులోని అధ్యాపకులు, విద్యార్థులు వారిని అడ్డుకోవడంతో నాజీ సైన్యం వారిపై కాల్పులు జరిపింది.  1200కి పైగా విద్యార్థులను నిర్బంధించింది. కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు.

ఈ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత 1941లో అంతర్జాతీయ విద్యార్థుల సమైక్య మండలి లండన్ లో సమావేశం అయ్యింది. అందులో 1939 నాటి విద్యార్థుల బలిదానానికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 17వ తేదీన అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా జరపాలని తీర్మానించారు. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

విద్యార్థులు పాటించాల్సిన అధ్యయన ప్రణాళిక:
తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించే ప్రతి సబ్జెక్టును పూర్తి ఏకాగ్రతతో ఆలకిస్తూ, విద్యార్థులు కొన్ని ముఖ్య నియమాలను పాటిస్తే అద్భుత విజయాలు సాధించవచ్చు. అవగాహనతో కూడిన అభ్యసనం.. పాఠాలను యాంత్రికంగా బట్టీ పట్టకుండా, ప్రతి అంశం వెనుక ఉన్న మూల సూత్రాలను అర్థం చేసుకోవాలి. సందేహాలను వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి.  క్లాస్ వర్క్ పుస్తకంలో ముఖ్యమైన పాయింట్లను రాసుకొని, ఇంటికి వెళ్లిన తర్వాత వాటిని సొంత మాటల్లో పునశ్చరణ ( చేసుకోవాలి.   సెల్‌ఫోన్, అనవసర కాలక్షేపాలకు దూరంగా ఉండి, ప్రతి సబ్జెక్టుకు రోజువారీ టైమ్‌టేబుల్ ప్రకారం సమయం కేటాయించాలి.   పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయంలోని మంచి పుస్తకాలు, దినపత్రికలు చదవడం ద్వారా భాషా నైపుణ్యం, ఆత్మవిశ్లేషణ శక్తి పెరుగుతాయి.   

Also Read: 

మళ్లీ పతనమైన బంగారం ధర.. తులం 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

కుదేలవుతున్న వెండి మార్కెట్.. ఒక్కసారిగా భారీగా తగ్గిన ధరలు! నవంబర్ 17 సిల్వర్ రేట్ ఇదే..!!

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Telugu News