SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sarpanch Post Auction: వేలంలో భారీ ధర పలికిన 'సర్పంచ్‌' పోస్టు.. ఎంత అంటే?

Rs 81 Lakhs Price For Sarpanch Post In Auction: ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌ ఎన్నికలు రావడంతో గ్రామీణ రాజకీయం వేడెక్కగా.. ఏకగ్రీవం కోసం కొన్ని గ్రామాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ గ్రామ సర్పంచ్‌ పదవికి వేలం వేయగా ఏకంగా రూ.81 లక్షలు ధర పలికింది. ఇంత భారీ ధర ఎక్కడో తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Nov 15, 2026, 21:17 IST | Updated: Nov 15, 2026, 21:30 IST
Image Credit: Sarpanch Post Auction
Join

Sarpanch Post Auction: పంచాయతీ ఎన్నికల ప్రకటన రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. సర్పంచ్‌ పదవి కోసం అన్నీ రాజకీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు గ్రామంలోని పెద్ద మనుషులు, ధనవంతులు సర్పంచ్‌ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌ పదవి కోసం డబ్బులు వెదజల్లుతున్నారు. ఏకగ్రీవం అయ్యేందుకు కొన్ని పంచాయతీలు ప్రయత్నం చేయగా.. వేలం ద్వారా సర్పంచ్‌ పదవిని అమ్మకానికి పెట్టారు. ఓ గ్రామంలో సర్పంచ్‌ పదవి రూ.81 లక్షల ధర పలికింది.

తొలి విడత గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవడంతో గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామాభివృద్ధే లక్ష్యంగా గ్రామస్తులు ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఓ సర్పంచ్‌ పదవికి వేలం వేయగా భారీ ధర పలికింది. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ పంచాయతీలో రూ.81 లక్షల ధర పలికింది. దీనికి సంబంధఙంచిన వివరాలు ఇలా ఉన్నాయి.

జొన్నలగడ్డ గ్రామంలో 5 వేల లోపు జనాభా ఉంది. ఈ పంచాయతీకి తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే సర్పంచ్‌ పదవికి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం చేయాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు టీడీపీ కూడా అంగీకారం తెలిపింది. దీంతో గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. ఈ సర్పంచ్‌ పదవి కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. ముగ్గురు పోటీపడడంతో ఎవరిని ఎంపికపై గ్రామ పెద్దలు సమాలోచనలు చేసి వేలం నిర్వహించారు.

రెండు రోజుల కిందట జొన్నలగడ్డ గ్రామంలో పంచాయతీ పెద్దల సమక్షంలో వేలంపాట నిర్వహించారు. అయితే చివరికి వేలంలో ఇద్దరు ఆశావహులు పోటీలో నిలబడ్డారు. కొరటా గోపాలరావు, యర్రా శ్రీనివాసరావు సర్పంచ్‌ పదవి కోసం హోరాహోరీగా వేలం పాట పాడారు. ఎలాగైనా సర్పంచ్‌ పదవిని సొంతం చేసుకోవాలని లక్షలు లక్షలు పెంచుకుంటూ పోయారు. చివరికి కొరటా గోపాలరావు రూ.77 లక్షలకు వేలం పాట పాడగా.. ప్రత్యర్థి యర్రా శ్రీనివాసరావు రూ.81 లక్షలు వేలం పాట పాడారు. అయిఏత కొరటా గోపాలరావు వేలం పాట నుంచి వైదొలగడంతో యర్రా శ్రీనివాసరావు సర్పంచ్‌ పదవిని కైవసం చేసుకున్నారు. రూ.81 లక్షలకు సర్పంచ్‌ పదవి వేలం జరగ్గా ఈ విషయం పల్నాడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడంతో జొన్నలగడ్డ గ్రామానికి ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహక నగదు బహుమతి లభించనుంది. జొన్నలగడ్డ పంచాయతీ 5 వేల లోపు జనాభా ఉండడంతో ప్రభుత్వం రూ.15 లక్షలు ప్రోత్సాహక నగదు ఇవ్వనుంది. వేలం పాట ద్వారా వచ్చిన రూ.81 లక్షలు, ప్రభుత్వం ఇచ్చే నగదు ప్రోత్సాహం రూ.15 లక్షలతో తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు ఆశాభావంతో ఉన్నారు.

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వ ప్రోత్సాహకం
పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుంటే వాటికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను ఇటీవల ఏపీ ప్రభుత్వం భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఏకగ్రీవ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాలు ఇలా ఉన్నాయి.

5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు: రూ.15 లక్షలు
5 వేల నుంచి 10 వేల లోపు జనాభా పంచాయతీలు: రూ.25 లక్షలు
10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలు: రూ.50 లక్షలు

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES