• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Bhuma Akhila Priya: అహోబిలంలో హైటెన్షన్.. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా కారుపై రాళ్ల దాడి.. వీడియో వైరల్..

Bhuma Akhila Priya: అహోబిలంలో హైటెన్షన్.. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా కారుపై రాళ్ల దాడి.. వీడియో వైరల్..

Attack on Bhumaakhila priya convoy: పంచాయతీ ఎన్నికల సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికంగా పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్నారని తెలిసి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా అక్కడకు వెళ్లారు. దీంతో ప్రత్యర్థులు ఆమె కారుపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో అహోబిలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Written ByInamdar Paresh
Published: Nov 26, 2026, 14:23 IST|Updated: Nov 26, 2026, 14:30 IST
joinshare
Bhuma Akhila Priya: అహోబిలంలో హైటెన్షన్.. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా కారుపై రాళ్ల దాడి.. వీడియో వైరల్..
Image Credit: attack on bhuma akhila priya car

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
200MP కెమెరా, 7800mAh బ్యాటరీ.. వివో X500 ప్రో మ్యాక్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

200MP కెమెరా, 7800mAh బ్యాటరీ.. వివో X500 ప్రో మ్యాక్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

2

Rajamouli Varanasi OTT Deal: మహేశ్ బాబు 'వారణాసి'కి ఓటీటీలో కళ్లు చెదిరే ఆఫర్.. డిజిటల్ హక్కుల ధర తెలిస్తే షాక్!

3

Bhuma Akhila Priya: అహోబిలంలో హైటెన్షన్.. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా కారుపై రాళ్ల దాడి.. వీడియో వైరల్..

4

బంగారం, వెండి కాదు.. తన ఎముకలతోనే ఆభరణాలు చేయించుకున్న ట్రాన్స్‌జెండర్!

5

Sampath Nandi Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు?! 'సర్దార్ గబ్బర్ సింగ్'నుంచి తప్పుకోవడంపై సంపత్ నంది క్లారిటీ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Stone pelting on  mla bhuma akhila Priya convoy in ahobilam: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఉదయం నుంచి పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రాల వద్ద పలుచోట్ల వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ లు, తమ ఏజెంట్లను అడ్డుకున్నారంటూ టీడీపీ  వర్సెస్ వైసీపీ పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో పోలీసులు సైతం రంగంలోకి దిగి ఎక్కడిక్కడ కార్యకర్తల్నిచెదరగొట్టారు. ఈక్రమంలో నంద్యాల జిల్లా అహోబిలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

 

ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి. ముగ్గురు మహిళలను ఢీకొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎస్కార్ట్ వాహనం ప్రమాదంలో ముగ్గురు మహిళలకు గాయాలు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం https://t.co/7tn2S6UPtJ

— greatandhra (@greatandhranews) November 26, 2026

 

 

ఏపీలోని నంద్యాల జిల్లా  అహోబిలంలోని జమ్మదిన్నే పంచాయతీ కేంద్రంలో రిగ్గింగ్ చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియాకు సమాచారం అందడంతో ఆమె నేరుగా రంగంలోకి దిగారు. పోలింగ్ కేంద్రంకు వెళ్తుండగా ఆమె కారుపై ప్రత్యర్థులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు మహిళలకు కూడా గాయాలయ్యాయి.

దీంతో ఆగ్రహంకు గురైన టీడీపీ కార్యకర్తలు వైసీపీ వర్గీయులపై రాళ్లదాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.  వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో నంద్యాల ఎస్పీతో పాటు ఉన్నాతాధికారులు దాడి జరిగిన ప్రదేశంకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా బలగాల్ని మోహరించారు. మరోవైపు దాడి ఘటనను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా తీవ్రంగా ఖండించారు.  నడి రోడ్డు మీద కూర్చుని నిరసనలకు దిగారు. దీంతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Elections