Vivo X500 Pro Max: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన వివో X500 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి వచ్చింది.. ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీ, భారీ బ్యాటరీ, ప్రొఫెషనల్ కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలవ్వడం విశేషం. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వివో X500 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 6.85 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 3168x1440 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 1-144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. అంతేకాకుడా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తోంది.. ఎండలోనూ స్క్రీన్ అత్యంత స్పష్టంగా కనిపించేలా దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది.. HDR10 ప్లస్‌తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటం వీడియో కూడా అద్భుతమైన క్వాలిటీతో లభిస్తుంది. దుమ్ము, నీటి నుంచి ప్రొటక్షన్ కోసం దీనికి IP68 ప్లస్ రేటింగ్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్ కేవలం 7.95 మి.మీ మందంతో పాటు, 225 గ్రాముల బరువుతో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఇందులో వీవో కంపెనీ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది. దీనికి మాలి-G2-అల్ట్రా-NX GPUతో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది 12GB LPDDR5X అల్ట్రా ర్యామ్‌తో పాటు గరిష్టంగా 1TB వరకు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత సరికొత్త ఆరిజిన్ OS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది..
వివో ఎప్పటిలాగే కెమెరాకు ఇందులో పెద్దపీట వేసిన్నట్లు తెలుస్తోంది. ఇందులో వెనుకవైపు జైస్ భాగస్వామ్యంతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ ZEISS APO టెలిఫోటో కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా దీనికి తోడు 50 మెగాపిక్సెల్ ZEISS ట్రూ డైనమిక్ ప్రధాన కెమెరాతో పాటు అదనంగా 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాను కూడా అందిస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో ఏకంగా 7800mAh బ్యాటరీతో పాటు 90W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
అపెక్స్ ఆరెంజ్, ఎటర్నల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,64,999తో అందుబాటులో ఉంది. ఇక 12GB ర్యామ్‌తో పాటు 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,79,999తో లభిస్తోంది.. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. త్వరలోనే వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాంచ్ ఆఫర్ కింద కస్టమర్లకు రూ.18,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్, రూ. 23,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది..