Bhuma Akhila Priya: అహోబిలంలో హైటెన్షన్.. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా కారుపై రాళ్ల దాడి.. వీడియో వైరల్..
Attack on Bhumaakhila priya convoy: పంచాయతీ ఎన్నికల సందర్భంగా నంద్యాల జిల్లా అహోబిలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికంగా పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్నారని తెలిసి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా అక్కడకు వెళ్లారు. దీంతో ప్రత్యర్థులు ఆమె కారుపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో అహోబిలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Stone pelting on mla bhuma akhila Priya convoy in ahobilam: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఉదయం నుంచి పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రాల వద్ద పలుచోట్ల వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ లు, తమ ఏజెంట్లను అడ్డుకున్నారంటూ టీడీపీ వర్సెస్ వైసీపీ పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో పోలీసులు సైతం రంగంలోకి దిగి ఎక్కడిక్కడ కార్యకర్తల్నిచెదరగొట్టారు. ఈక్రమంలో నంద్యాల జిల్లా అహోబిలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఏపీలోని నంద్యాల జిల్లా అహోబిలంలోని జమ్మదిన్నే పంచాయతీ కేంద్రంలో రిగ్గింగ్ చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియాకు సమాచారం అందడంతో ఆమె నేరుగా రంగంలోకి దిగారు. పోలింగ్ కేంద్రంకు వెళ్తుండగా ఆమె కారుపై ప్రత్యర్థులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు మహిళలకు కూడా గాయాలయ్యాయి.
దీంతో ఆగ్రహంకు గురైన టీడీపీ కార్యకర్తలు వైసీపీ వర్గీయులపై రాళ్లదాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో నంద్యాల ఎస్పీతో పాటు ఉన్నాతాధికారులు దాడి జరిగిన ప్రదేశంకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా బలగాల్ని మోహరించారు. మరోవైపు దాడి ఘటనను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా తీవ్రంగా ఖండించారు. నడి రోడ్డు మీద కూర్చుని నిరసనలకు దిగారు. దీంతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.