Vivo X500 Launched: వివో కంపెనీ ఎప్పటికప్పుడు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తూ ఉంటుంది. అద్భుతమైన కెమెరాతో విడుదల చేసేందుకు ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎప్పుడు ముందుంటుంది. తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ వివో X500ను అధికారికంగా విడుదల చేసింది.. ప్రీమియం కెమెరా సెటప్‌తో పాటు భారీ బ్యాటరీ సామర్థ్యం, అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారత మార్కెట్లో వివో X500 స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బేస్ వేరియంట్‌లో 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎంబర్ రెడ్, టైటానియం బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అయ్యింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి వివో అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా బ్యాంక్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే.. 10 శాతం తక్షణ తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తోంది..
ఈ స్మార్ట్‌ఫోన్ 6.59-అంగుళాల 1.5K LTPS AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 6,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.. ఎండలో కూడా స్క్రీన్ అత్యంత స్పష్టంగా కనిపించేలా దీనిని తయారు చేశారు. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600M చిప్‌సెట్ ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యింది. దీనికి 12GB వరకు LPDDR5X అల్ట్రా ర్యామ్‌తో పాటు 256GB UFS 4.1 స్టోరేజ్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
వివో ఇందులో అద్భుతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. వెనుకవైపు OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ LYTIA-828 ప్రధాన కెమెరాను కూడా అందిస్తోంది. ఇది 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు 3.1x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 50-మెగాపిక్సెల్ సోనీ LYT610 ZEISS APO టెలిఫోటో కెమెరా కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో 50 మెగాపిక్సెల్ హై రిజల్యూషన్ కెమెరాను కూడా అందించారు..
సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు భిన్నంగా ఇందులో ఏకంగా 7,500mAh బ్లూవోల్ట్ బ్యాటరీని అందించడం విశేషం.. దీనికి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, గేమింగ్ సమయంలో వేడెక్కకుండా ఉండే బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. అలాగే చాలా ప్రత్యేకమైన IP68, IP69 రేటింగ్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.