• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /TDP సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత..

TDP సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత..

Ex AP Minister Yanamala Ramakrishnudu Hospitalised: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా జ్వరం, నీరసంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 12:47 PM IST|Updated: Oct 22, 2026, 01:13 PM IST
joinshare
TDP సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత..
Image Credit: Yanamala (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tamannaah Bhatia: OTTలోకి తమన్నా బ్లాక్ బస్టర్ మిస్టరీ థ్రిల్లర్... కానీ ఓ ట్విస్ట్!

Tamannaah Bhatia: OTTలోకి తమన్నా బ్లాక్ బస్టర్ మిస్టరీ థ్రిల్లర్... కానీ ఓ ట్విస్ట్!

2

జీర్ణ సమస్యలు.. మలబద్ధకంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారా? ఈ 3 పదార్థాలు మీ డైట్‌లో చేర్చితే చాలు!

3

Kurnool: దేవరగట్టు బన్నీఉత్సవంలో విషాదం.. ఒకరి దుర్మరణం.. వందల మందికి తీవ్ర గాయాలు.. వీడియో..

4

TDP సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత..

5

నీ కలలకు రాజసం ఉండాలి.. నీ కష్టానికి నిజాయితీ ఉండాలి.. ఆవు పులి నీతికథ..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ex AP Minister Yanamala Ramakrishnudu Health Update: గత కొంత కాలంగా అంతగా యనమల రామకృష్ణుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఈ సారి క్యాబినేట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన అనారోగ్యం పాలు కావడంతో కుటుంబ సభ్యులు కాకినాడలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు డాక్లర్లతో మాట్లాడి యమమల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

ఆసుపత్రికి చేరుకున్న రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు...ఆయనకు అందుతున్న ట్రీట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యుల నుంచి హెల్త్ బులెటిన్ రావాల్సి ఉంది. యనమల రామకృష్ణుడు విషయానికొస్తే.. ఈయన 1983లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో ఉంటూ పలు పదవులు పొందారు. అంతేకాదు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో లా అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌గా పనిచేశారు. 1985-89 వరకు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో సహకార శాఖ మంత్రిగా పనిచేశారు.

14వ శాసన సభ స్పీకర్‌గా బాధ్యతలు..

1994లో 14వ శాసనసభకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ స్వీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవీచ్యుతుడు అయ్యే సమయంలో ఆయనే స్పీకర్‌గా  ఉన్నారు. 1999-2004 మధ్య చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక , ప్రణాళిక, శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2013లో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేకాదు 2014 -2019 మధ్య  విభజిత ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
TDP
Andhra Pradesh
AP News
Chandrababu Naidu