• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Chandrababu: తెలుగు ప్రజలు నాకు రాజకీయ భిక్ష పెట్టారు: సీఎం చంద్రబాబు

Chandrababu: తెలుగు ప్రజలు నాకు రాజకీయ భిక్ష పెట్టారు: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Naidu Interesting Comments On His Political Life: సీఎం పదవి తనకు కొత్త కాదని.. తెలుగు ప్రజలు ఇచ్చిన రాజకీయ భిక్ష అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం తాను, పవన్‌ కల్యాణ్‌, మోదీ కలిశామని తెలిపారు. సుపరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 01, 2026, 07:21 PM IST|Updated: Oct 01, 2026, 07:24 PM IST
joinshare
Chandrababu: తెలుగు ప్రజలు నాకు రాజకీయ భిక్ష పెట్టారు: సీఎం చంద్రబాబు
Image Credit: Source: Jai TDP

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chandrababu Political Life: తనకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని.. తెలుగు ప్రజలే తనకు రాజకీయ భిక్ష పెట్టారని సీఎం చంద్రబాబు తెలిపారు. కష్టాలు ఉన్నప్పుడు తాను పారిపోనని.. పోరాడుతానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని.. సుపరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం తాను, పవన్‌ కల్యాణ్‌, మోదీ కలిశామని మరోసారి సీఎం చంద్రబాబు చెప్పారు.

'రాష్ట్రవ్యాప్తంగా విశాఖ, విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో నివాసస్థలాల్లో పేదలకు పట్టాలు ఇచ్చాం. రూ.52 వేల కోట్ల విలువైన నివాస స్థలాలకు పట్టాలు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాం. పేదల కుటుంబాలకు చేయుతను ఇచ్చే అంశాన్ని ఆర్ధిక కోణంలో చూడటం లేదు. పేద కుటుంబాల్లో 3-4 పథకాల ద్వారా ఆర్ధిక సహకారం చేయూత అందుతోంది' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం, మత్స్యకార సేవలో, ఆటోడ్రైవర్ల సేవలో ఇలా వేర్వేరు పథకాలు అందుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో ప్రతీ వర్గాన్ని ఆదుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు.

రేపల్లెలో గురువారం నిర్వహించిన పేదల సేవలో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. 'రాష్ట్రంలో లక్ష మంది డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చాం. మరో 5 లక్షల మందిని కూడా వ్యాపారవేత్తలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతినెలా డబ్బులు ఇచ్చేసి వెళ్లడానికి రాలేదు. ప్రజలను కలిసి వారి బాగోగులు తెలుసుకోడానికి వస్తున్నా' అని సీఎం చంద్రబాబు చెప్పారు. అట్టడుగు వ్యక్తికి ఆర్ధిక స్థోమత ఇచ్చి జీవన ప్రమాణాలు పెంచినప్పుడే అభివృద్ధి... అదే నా సిద్ధాంతం అని ప్రకటించారు.

సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా చేపడుతున్నామని.. పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేల కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 11వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలనలో రోడ్లన్నీ గోతులు పడి ఉన్నాయి. రెండేళ్లుగా వాటిని పూడ్చి రోడ్లు బాగు చేశామని చెప్పారు. 'సంజీవని కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా పర్యవేక్షిస్తాం. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించటం ద్వారా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం...వీటితో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

'సంపద సృష్టించేలా క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ పెంచాం. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు పూర్తి చేస్తున్నాం. రాయలసీమ జీవనాడి హంద్రినీవా మొదటి దశ పనులు పూర్తయ్యాయి. వంద రోజుల్లో రూ.3,500 కోట్ల ఖర్చు చేసి చిట్టచివరి ప్రాంతమైన కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లాం. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసి మార్కాపురం వరకూ నీళ్లు తీసుకువచ్చాం. శ్రీశైలం మల్లన్న పాదాల నుంచి మార్కాపురం చెన్నకేశవ స్వామి చెంతకు కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్లాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ గోదావరి నీళ్లు తీసుకువెళ్లాం' అని సీఎం చంద్రబాబు వివరించారు.

'ఎల్ నినో కారణంగా వర్షాలు పడక రాష్ట్రంలో కరవు వచ్చింది. డ్రామాలు ఆడటానికి గొడ్డలి పార్టీ బయల్దేరింది. వరుణ దేవుడి కృపవల్ల మనకు సరైన సమయంలో కాస్త వర్షాలు పడ్డాయి. కృష్ణానదిలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా డెల్టాకు తెచ్చాం. గతంలో కేవలం 13 నెలల్లోనే పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకువచ్చాం. పోలవరం పూర్తి అయితే కృష్ణా, గోదావరి డెల్టాలకూ నీటి సమస్యే ఉండదు' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

పట్టిసీమ అనే నిర్ణయం ఇక్కడి రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చిందని.. గొడ్డలి పార్టీ విమర్శలకు భయపడితే కృష్ణాడెల్టాకు నీళ్లు వచ్చేవి కావు అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ అంటే పోటీ తత్వం ఉండాలి కాని గొడ్డలి పార్టీకి కుట్రతత్వం ఉందని వైఎస్సార్‌సీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి ఆటంకాలు కలిగించటమే గొడ్డలి పార్టీ పని అని విమర్శించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Chandrababu Naidu
TDP
AP News
Andhra Pradesh
Telugu News