• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Snake Video: మహాఅద్భుతం.. శివలింగంను చుట్టు పడగవిప్పిన మూడు నాగుపాములు.. వీడియో..

Snake Video: మహాఅద్భుతం.. శివలింగంను చుట్టు పడగవిప్పిన మూడు నాగుపాములు.. వీడియో..

Nellore snake video: పడగ విప్పి శివలింగం వద్ద చుట్టుకుని ఉన్న మూడు నాగుపాములను చూసి భక్తులు శివమహిమగా భావిస్తున్నారు. అది కూడా సోమవారం రోజు ఈ ఘటన వెలుగులోకి రావడంతో భక్తులు భారీగా ఆలయంకు క్యూలు కట్టారు.

Written ByInamdar Paresh
Published: Oct 05, 2026, 07:57 AM IST|Updated: Oct 05, 2026, 08:07 AM IST
joinshare
Snake Video: మహాఅద్భుతం.. శివలింగంను చుట్టు పడగవిప్పిన మూడు నాగుపాములు.. వీడియో..
Image Credit: Snakesonshivalingamnellorevideo

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
పసిడి ప్రియులకు ఊరట.. మరోసారి బంగారం ధరలు డౌన్.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..!!

పసిడి ప్రియులకు ఊరట.. మరోసారి బంగారం ధరలు డౌన్.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..!!

2

Hyderabad: పుట్టిన రోజునాడే నిండిన నూరెళ్లు.. ట్యాంక్ బండ్ వద్ద లారీ ఢీకొని చిన్నారితో పాటు, బంధువు దుర్మరణం..

3

Snake Video: మహాఅద్భుతం.. శివలింగంను చుట్టు పడగవిప్పిన మూడు నాగుపాములు.. వీడియో..

4

ఎంటర్ ది ‘డ్రాగన్’ .. మళ్లీ షూటింగ్‌ కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ?

5

సీనియర్ హీరోయిన్స్‌కు వరంగా మారిన స్పెషల్ సాంగ్స్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Three cobras were spotted at the shiva lingam in Nellore: ఇటీవల పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలో, గుళ్లలో సైతం  కోబ్రాలు దర్శనమిస్తున్నాయి. అందుకే కోబ్రాలతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో  నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద విశ్వనాథ స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున మూడు నాగుపాములు వచ్చాయి. 

 

శివలింగం చుట్టూ 3 నాగుపాములు.. భక్తుల పరవశం! నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద విశ్వనాథ స్వామి ఆలయంలోకి తెల్లవారుజామున మూడు నాగుపాములు వచ్చాయి. శివలింగం ఎదురుగా పడగవిప్పి కాసేపు అక్కడే ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇటీవల తరచూ పాములు ఆలయంలోకి వస్తుండటంతో పూజారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

— greatandhra (@greatandhranews) October 5, 2026

అవి శివలింగం ఎదురుగా పడగవిప్పి కాసేపు అక్కడే ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం పూట ప్రతి రోజులాగే పూజారీ ఆలయం తలుపులు తీసి చూసే సరికి మూడు పాములు పడగ విప్పి మరీ శివలింగం చుట్టు కూర్చున్నాయి.

 భక్తులు కూడా స్వామి దర్శనం కోసం వచ్చిన  వారు ఈ ఘటన  చూసి భక్తితో పొంగిపోతున్నారు. ముఖ్యంగా సోమవారం రోజు నాగేంద్రుడు, సుబ్రహ్మాణ్యుడు ఈ విధంగా తమకు దర్శన భాగ్యం ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు. అయితే.. ఇటీవల తరచూ పాములు ఆలయంలోకి వస్తుండటంతో పూజారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనిలో పాము కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

అయితే గతంలో  నాగుల చవితి రోజున కూడా ఇదే  ఆలయంలో రెండు పాములు శివలింగం చుట్టు పడగ విప్పి నిలబడ్డాయి. మరల ఇప్పుడు మూడు పాములు శివలింగం చుట్టు వచ్చి పడగ విప్పడంతో ఇదంతా దైవమహిమగా భక్తులు భావిస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Trending News