SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirupati: తిరుపతిలో పెను విషాదం.. క్రేన్ కూలీ ముగ్గురు దుర్మరణం, మరోకరు సీరియస్..

Crane accident in Tirupati: భవన నిర్మాణం కోసం జేసీబీతో మట్టిని తీస్తుండగా ఇంతలో పెను విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలో జరిగిన విషాదంలో ముగ్గురు కార్మికులు స్పాట్ లోనే చనిపోవడం అందరిని కలిచి వేసింది.

Written By Inamdar Paresh
Published: Sep 29, 2026, 03:05 PM IST | Updated: Sep 29, 2026, 03:12 PM IST
Image Credit: cranecollapsedintirupatinews
Join

Three workers dead in crane accident in Tirupati: ప్రసిధ్ద ఆధ్మాత్మిక నగరమైన తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ క్రేన్ ఒక్కసారిగా విరిగి పడటంతో దాని కింద పడి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు.
తిరుపతిలోని.. డీబీఆర్ రోడ్డులో శ్రీ కన్వెన్షన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ ఒక్కసారిగా విరిగి కింద పడింది. దీని కింద ముగ్గురు కార్మికులు చిక్కుకుని స్పాట్ లోనే చనిపోయారు. శ్రీ కన్వెన్షన్ పక్కన హోటల్ నిర్మాణం కోసం సుమారు 50 అడుగుల లోతులో పునాదులు తీస్తున్నారు. 

ఈ క్రమంలో భారీ చెట్టును తొలగించే పనులు చేపట్టగా.. మట్టి తొలగింపు, నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న భారీ క్రేన్ విరిగి పునాదుల వద్దకు కూలినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనేచుట్టుపక్కల వారు.  సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు రంగంలోకి దిగి అందులో చిక్కుకున్న వారి డెడ్ బాడీలను బైటకు తీశారు. మృతులను **ఒడిశా రాష్ట్రానికి చెందిన రామారావు (45), శ్రీకాకుళం జిల్లాకు చెందిన సివిల్ ఇంజనీర్ సందీప్ (34), తిరుపతికి చెందిన గార్డెన్ వర్కర్ చెంగయ్య (40) లుగా గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు హాస్పిటల్ కి తరలించారు.  ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES