నేడు అల్ప పీడనం.. మరో తుపాను ముప్పు..
Heavy Rains in Andhra Pradesh: నేడు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వెంటాడుతుంది. అది తుపానుగా మారుతుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా ఇప్పటికే ఏపీకి వరుసగా రెండు తుపానులు అర్నబ్,మురసు తుపానులు వెంటనే వచ్చాయి. తొందరగానే వెళ్లిపోయాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి తుపానుగా రూపాంతరం చెందుతుందా లేదా అనేది చూడాలి.
AP Another Toofan: ఈ సీజన్‌లో వరుసగా రెండు తుపాన్లను ఎదుర్కొన్న ఆంధ్ర ప్రదేశ్ మరో ముప్పు పొంచివుంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి నవంబర్ 14 నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
తీవ్ర వాయుగుండం..
ఇది నవంబర్ 15 నాటికి వాయు గుండంగా, తరువాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలున్నాయంటోంది. అయితే ఇది ఆ తర్వాత ఏ దిశగా పయనిస్తుంది. మరింత తీవ్రమై తుపానుగా మారుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుపై వుంటుందంటోంది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ .
రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలన్న IMD..
మొదటగా అల్పపీడనం బలపడి తమిళనాడు, దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్ దిశగా కదలే అవకాశాలున్నాయని తెలిపింది. అటు దక్షిణ పశ్చిమ బంగాళాఖాతానికి చేరుకున్న తర్వాత సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడే సమయంలో దిశ మార్చుకుని మయన్మార్ తీరం వైపు వెళ్లడం అనే ఆప్షన్స్ ఉన్నాయి.2026 అక్టోబర్ నెల చివరి వారంలో అర్నబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత నవంబర్ ప్రారంభంలో మురసు తుపాను కూడా ఏపీలోని తూర్పు తీరాన్ని అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు వరుసగా మూడో తుపాను ఏర్పడే సూచనలు కనిపించడంతో అధికారులు ఎప్పటికపుడు అప్‌డేట్స్ అందిస్తున్నారు.