SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నేటితో ఏపీలో ముగియనున్న మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలకు నామినేషన్లు..

Today Nominations Last Day: ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు ఈరోజు చివరి తేదీ. 16వ తేదీ ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ నేటి సాయంత్రంతో ముగుస్తుంది. అయితే తొలి రోజు నుంచే రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 18, 2026, 12:43 PM IST | Updated: Oct 18, 2026, 02:02 PM IST
Image Credit: Nominations Last Day (File Pic/Source)
Join

Muncipal Corporations Elections Nominations: ఆంధ్ర ప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. అంతేకాదు నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రచ్చ చేస్తున్నారు. పుంగనూరు నామినేషన్ ప్రక్రియతో మొదలైన రగడ రాష్ట్రంలో అన్ని చోట్లా రగులుతూనే ఉంది. ముఖ్యంగా రాయలసీమలో హై టెన్షన్ నెలకొంది.

పులివెందులలో కాల్పుల ఘటన జరుగడంతో ఇక ఆఖరి రోజు ఎన్నికల కమిషన్ ప్రక్రియపై పోలీసులు దృష్టి పెట్టారు. పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.  ముఖ్యంగా రాయలసీమలో అధఙకారులు హై అలర్ట్‌ ప్రకటించారు. తొలి రెండు రోజులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆఖరి రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ భద్రతను కట్టుదిట్టం చేసింది. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతించనుంది.

కనీసం మీడియాను కూడా నామినేషన్ కేంద్రం లోపలికి అనుమతించకుండా గట్టి చర్యలు తీసుకుంది. నామినేషన్ ప్రక్రియకే ఈవిధమైన దాడులు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే ఎన్నికల సమయం, కౌంటింగ్ వేళ ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES