• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Dussehra Tragedy: దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పుట్టింటికి వెళ్తుండగా అన్నాచెల్లెలు దుర్మరణం

Dussehra Tragedy: దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పుట్టింటికి వెళ్తుండగా అన్నాచెల్లెలు దుర్మరణం

Dusshera Tragedy Tragedy Brother And Sister Death In Road Accident: దసరా పండుగకు పుట్టింటికి వచ్చిన చెల్లెలును అన్న తీసుకెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అన్నాచెల్లెలు ఇద్దరూ మృతి చెందగా.. వారి వెంట ఉన్న చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌ శివారు పెద్దఅంబర్‌పేటలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 18, 2026, 04:05 PM IST|Updated: Oct 18, 2026, 04:11 PM IST
joinshare
Dussehra Tragedy: దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పుట్టింటికి వెళ్తుండగా అన్నాచెల్లెలు దుర్మరణం
Image Credit: Brother And Sister Road Accident

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
డార్లింగ్ ఫ్యాన్స్ ఇంకా ఆగాల్సిందేనా? ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

డార్లింగ్ ఫ్యాన్స్ ఇంకా ఆగాల్సిందేనా? ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

2

Durga Ashtami: వేములవాడలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు.. మహాగౌరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు

3

ఎయిర్‌టెల్ సంచలనం.. రూ.185 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్! టెలికాం రంగంలో తొలి ఆపరేటర్‌గా రికార్డ్!

4

Dussehra Tragedy: దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పుట్టింటికి వెళ్తుండగా అన్నాచెల్లెలు దుర్మరణం

5

YS Jagan: ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Road Accident: రెండు రోజుల్లో దసరా పండుగ వస్తుండడంతో ఎంతో ఆశలతో.. కుటుంబసభ్యులతో ఆనందంగా పండుగ చేసుకుందామని పుట్టింటికి బయల్దేరిన ఆ సోదరి.. తన చెల్లెలు వస్తుందనే ఆనందంతో తనను బైక్‌పై తీసుకుని ఇంటికి తీసుకెళ్తుండగా ఆమె సోదరుడు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను రోడ్డు ప్రమాదం కబళించింది. వారిద్దరి ప్రాణాలు తీయగా.. వారి వెంట ఉన్న చిన్నారి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ సంఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం హయత్‌నగర్‌లోని పెద్ద అంబర్‌పేట్‌కు చెందిన జంగయ్య కూతురు రేఖకి వివాహమై ఓ పాప ఉంది. కుటుంబంతో కలిసి ఆమె శంషాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పల్లిలో నివసిస్తుండేది. రెండు రోజుల్లో దసరా పండుగ ఉండడంతో శంషాబాద్ నుంచ పుట్టింటికి వచ్చేందుకు రేఖ బయల్దేరింది. శంషాబాద్‌ నుంచి ఎల్‌బీనగర్‌లో ఆమె బస్సు దిగగా.. ఆమె బాబాయి కుమారుడు అన్న వరుసయ్యే నవీన్ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చాడు.

డీసీఎం సడన్ బ్రేక్
తన స్కూటీపై ఎక్కించుకొని సోదరి రేఖ, చిన్నారి కోడలితో ఇంటికి బయల్దేరారు. అయితే హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే ముందుగా ఉన్న డీసీఎం వాహనం ఒకసారిగా బ్రేక్ వేసింది. దీంతో వెనకాల ఉన్న థార్ కార్ స్కూటీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో అన్నాచెల్లెలు ఇద్దరు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. గాయాలపాలైన చిన్నారిని స్థానికులు పోలీసుల సహాయంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదానికి కారణమైన థార్‌ కార్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు కుటుంబాల్లో విషాదం
అయితే అప్పటిదాకా ఆడబిడ్డ పుట్టింటికి వస్తుందని ఆశగా ఎదురుచూసిన ఆ కుటుంబం ఒక్కసారిగా తీవ్ర విషాదంలో మునిగింది. పండుగ కోసం మనవరాలితో కలిసి వస్తున్న బిడ్డతో ఆనందంగా గడపాలని భావించిన కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన బిడ్డ, కొడుకు ఇలా హఠాన్మరణం పొందడంతో ఆ రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. మనవరాలు ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో దసరా పండుగ వారి జీవితాల్లో చీకట్లు నింపింది.

బోడుప్పల్‌లో మరో ప్రమాదం..
దసరా పండుగ వేళ అందరూ స్వస్థలాల బాట పట్టడంతో పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. హైదరాబాద్‌ శివారులోని బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బాబాయ్ హోటల్ సమీపంలో ఓ కారు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు వాహనదారులకు గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
Hyderabad
Telugu News
Telangana News