• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఎయిర్‌టెల్ సంచలనం.. రూ.185 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్! టెలికాం రంగంలో తొలి ఆపరేటర్‌గా రికార్డ్!

ఎయిర్‌టెల్ సంచలనం.. రూ.185 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్! టెలికాం రంగంలో తొలి ఆపరేటర్‌గా రికార్డ్!

ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డేటా లేని కేవలం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. టెలికాం నిబంధనలను పాటిస్తూనే, డేటా లేకుండా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కేవలం రూ.185 తోనే ప్రారంభించిన తొలి ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 18, 2026, 04:10 PM IST|Updated: Oct 18, 2026, 04:13 PM IST
joinshare
ఎయిర్‌టెల్ సంచలనం.. రూ.185 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్! టెలికాం రంగంలో తొలి ఆపరేటర్‌గా రికార్డ్!
Image Credit: Airtel Voice Only Recharge Plan

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
డార్లింగ్ ఫ్యాన్స్ ఇంకా ఆగాల్సిందేనా? ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

డార్లింగ్ ఫ్యాన్స్ ఇంకా ఆగాల్సిందేనా? ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

2

Durga Ashtami: వేములవాడలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు.. మహాగౌరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు

3

ఎయిర్‌టెల్ సంచలనం.. రూ.185 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్! టెలికాం రంగంలో తొలి ఆపరేటర్‌గా రికార్డ్!

4

Dussehra Tragedy: దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పుట్టింటికి వెళ్తుండగా అన్నాచెల్లెలు దుర్మరణం

5

YS Jagan: ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Airtel Voice Only Recharge Plan: గత సెప్టెంబర్ నెలలో డేటా వాడే వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలకు కొన్ని ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని అన్ని టెలికాం కంపెనీలకు సూచించింది. అలాగే, ట్రయ్‌ కొత్త నిబంధనల ప్రకారం 30 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితితో, ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు శుభవార్త అందించడమే కాకుండా, నిబంధనలు పాటించిన తొలి ఆపరేటర్‌గా రికార్డు సృష్టించింది. డేటా లేకుండా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని రూ.185 నుండి ప్రారంభించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ప్రధానంగా డేటా అవసరం లేని వారికి, ఫీచర్ ఫోన్ వాడే వారికి ఎంతో ఉపయోగపడతాయి. ట్రai గడువు అక్టోబర్ 21తో ముగియనుంది, అయితే జియో, వోడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు ఇంకా ఇలాంటి ప్లాన్లను తీసుకురాలేదు.

ఎయిర్‌టెల్ ప్రధానంగా రూ.185, రూ.203, రూ.206 ప్లాన్లను పరిచయం చేసింది. ఇవి కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు మాత్రమే. ఈ మూడింటిలో కూడా అపరిమిత కాలింగ్, రోమింగ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ సౌకర్యం లభిస్తుంది. వీటి వాలిడిటీ 28 నుండి 30 రోజుల వరకు ఉంటుంది. ఇందులో మొబైల్ డేటా ఉండదు, కానీ ఫ్రీ హలో ట్యూన్స్ అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఎయిర్‌టెల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా వీటిని రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.185 ప్లాన్‌ వివరాల్లోకి వెళ్తే, ఇది 28 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇందులో అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది.
అదేవిధంగా, ఎయిర్‌టెల్ రూ.203 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి, దీని వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఇందులో కూడా మొబైల్ డేటా ఉండదు.  ఫీచర్ ఫోన్ వాడే వారు దీనిని కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్.. రూ.2,249 ప్లాన్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చేసిన టెలికాం దిగ్గజం!
 

ఫీచర్ ఫోన్ వాడేవారికి లేదా డేటా అవసరం లేని వారికి అదనంగా డబ్బు పెట్టి డేటా ప్యాక్స్‌ను కొనాల్సిన అవసరం లేదు. ఇకపై ఇలాంటి వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం ఉన్న ప్లాన్లతోనే తమ అవసరాలను తీర్చుకోవచ్చు. ఇది వరకు డేటా వాడని అమ్మలు, బామ్మలకు కూడా డేటా ఉండే ప్లాన్‌తో రీఛార్జీ చేయాల్సి వచ్చేది. ఇక ప్రైవేటు దిగ్గజ కంపెనీ తీసుకున్న నిర్ణయంతో ఇతర టెలికాం కంపెనీలు కూడా ఇదే ఫాలో అవుతారో లేదో చూడాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
National News