SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రేపే తొలి విడత పల్లెపోరు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..

Panchayath Election: ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ, మలి విడత మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి దశలో 3వేల 949 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొదట నోటిఫికేషన్‌ ఇచ్చింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 25, 2026, 05:45 IST | Updated: Nov 25, 2026, 08:12 IST
Image Credit: Panchayat Election (Source/ZEE News Telugu)
Join

AP Local Body Election: ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగే పంచాయితీ ఎన్నికల్లో  707 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 3వేల 242 పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది. మలి విడతలో 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 46,350 సిబ్బందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.  వీటిలో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలు, 19 పురపాలక సంఘాలతో పాటు నగర పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలకు గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. పట్టణ స్థానిక సంస్థల్లో సోమవారం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల్లో ఎక్కడైనా అవసరమైతే 27న రీపోలింగ్‌ నిర్వహిస్తారు.

తొలి దశలో 3,949 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ..

ఫస్ట్ ఫేస్‌లో ఎన్నికల్లో 707 పంచాయతీలు ఏకగ్రీవం కావటంతో మొదట నిర్ణయించిన 40వేల 781 పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను 31వేల 614కు కుదించారు. పోలింగ్‌ రూంలు 28వేల 61 నుంచి 23వేల 269కు తగ్గించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. 6వేల 303 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 536 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఉండనుంది.

ఓటర్లను రప్పించే పనిలో సర్పంచులు..

సర్పంచ్‌ అభ్యర్థులు గురువారం జరిగే మొదటి దశ పంచాయతీ పోలింగ్‌కు వలస ఓటర్లను రప్పించే పనిలో పడ్డారు. వాస్తవంగా కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో సుమారు 20 వేలమంది వలస ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ అభ్యర్థులు తమ పంచాయతీ పరిధిలోని వలస ఓటర్లకు రానుపోను బస్సు, రైలు చార్జీలతో ఇతర ఖర్చులకు ఫోన్‌పే చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. మరి కొంతమంది టిక్కెట్లు రిజర్వేషన్లు చేసి కొరియర్‌ ద్వారా పంపించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES